English | Telugu

ఆ రూంలోనే ఒకప్పటి స్టార్ సెలబ్రిటీస్...ఇప్పుడు శ్రీముఖి


నీతోనే డాన్స్ షో జడ్జ్ తరుణ్ మాష్టర్ కొత్తగా స్టార్ట్ చేసిన తన యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని వారాల ముందు రాధా, సదా క్యారవాన్, మేకప్ రూమ్ టూరు చేసి చూపించారు. ఇప్పుడు "చిట్ చాట్ విత్ శ్రీముఖి" పేరుతో ఆమె రూమ్, మేకప్ కిట్, అలాగే ఆమె హెయిర్ స్టైలిస్ట్ ప్రసన్న అన్ని కూడా చూపించారు. శ్రీముఖికి క్యారవాన్ లేదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సొంత మేకప్ రూమ్ ఉంది అని చెప్పారు. ఈ స్టూడియోలో సెలబ్రిటీస్ అందరికీ మేకప్ రూమ్స్ కట్టించారు అప్పట్లో. అలా శ్రీముఖికి కూడా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ ఉంది. అది తనకు ఎంతో లక్కీ రూమ్ కూడా అన్నారు తరుణ్ మాష్టర్. శ్రీముఖికి ఈ రూమ్ అంటే చాలా ఇష్టం కూడా. ఇదివరకు చాలా మంది సెలబ్రిటీస్ తమ క్యారవాన్ వచ్చే ముందు ఈ రూమ్ లోనే మేకప్ అవీ వేసుకునేవారు.

నాగేశ్వరావు, ఎన్టీఆర్ , శోభన్ బాబు, కృష్ణ గారు వీళ్లంతా క్యారవాన్ సిస్టం రాక ముందు ఈ రూంలోనే కూర్చుని మేకప్ వేసుకునేవారని చెప్పారు. ఇంతలో మేకప్ లేకుండా శ్రీముఖి తన కార్ లో వచ్చింది. మేకప్ లేకుండా చాలా బాగుంది అని తరుణ్ మాష్టర్ ఆమెను పొగిడేశారు. అదుర్స్ షో నుంచి శ్రీముఖి చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు టాప్ యాంకర్ ప్లేస్ కి వచ్చేసింది. అప్పుడు అంత స్ట్రగుల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆమె తన పేరెంట్స్ ని చాల హ్యాపీగా ఉంచగలుగుతోంది అన్నారు తరుణ్ మాష్టర్. మేకప్ లేకపోతేనే చాలా బాగుంది కదా...జయప్రద, జయసుధ వీళ్లందరినీ డామినేట్ చేస్తూ ఉంది శ్రీముఖి అందం. సదా, రాధ మేకప్ వేస్తే బాగుంటారు కానీ శ్రీముఖి మేకప్ లేకుండానే బాగుంటారు. శ్రీముఖి ఎప్పుడూ ఖాళీగా కూర్చోదు ఏదో ఒక ప్రోగ్రాం, ఈవెంట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పారు తరుణ్ మాష్టర్. ఇక ఈ వీడియోస్ మాత్రమే కాకుండా "ఎన్టీఆర్ గారు, చిరు గారు, బాలకృష్ణ గారు, నాగేశ్వరావు గారితో నా జర్నీ గురించి కూడా వ్లగ్స్ చేస్తాను. ఎందుకంటే చిరు గారు, బాలకృష్ణ గారు స్ట్రగుల్ ఐన డేస్ ని నేను దగ్గరుండి చూసాను. వాళ్ళే కాదు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిం, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఫిలింకి ఎంత కష్టపడ్డారు..అప్పటి నుంచి ఇప్పటికి ఎలా పైకి వచ్చారు..ఆ జర్నీ మొత్తాన్ని కూడా నా ఛానల్ లో చూపిస్తాను. శేఖర్ మాష్టర్ కూడా అంతే కష్టపడి పైకి వచ్చారు. ఆయనది కూడా నా ఛానెల్ లో చూపిస్తాను" అన్నారు తరుణ్ మాష్టర్.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.