English | Telugu
ఇనాయని కావాలనే డి-గ్రేడ్ చేస్తున్నారు
Updated : Nov 4, 2022
బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ గురించి రివ్యూస్ చెప్పించడానికి బీబీ కేఫ్ హిమజని పిలిచింది..ఇక హిమజ హౌస్ లో జరుగుతున్న ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. ఇనాయ సూర్య ఉన్నప్పుడు సూర్య లేకుండా గేమ్ ఆడేది కాదు...ఇప్పుడు సూర్య వెళ్ళిపోయాక మిస్ ఐపోతున్నా అంటూ ఫీలవుతోంది. ఆ విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. రెండు పడవల మీద కాళ్ళు వేయడం ఎందుకు..స్ట్రైట్ గా గేమ్ ఆడాలి. ఫైమా వెటకారం తాను ఎంజాయ్ చేయడానికి చేస్తుందా లేదా ఎదుటి వాళ్ళను ఎంటర్టైన్ చేయడానికి చేస్తుందా అనేది ఆమెకే క్లారిటీ లేదు."
అని హిమజ ఓవర్ ఆల్ గా రివ్యూ ఇచ్చింది. ఐతే నెటిజన్స్ మాత్రం వీళ్ళ మీద సెటైర్లు పేల్చుతున్నారు. "ఇనాయ గేమ్ ఆడుతోంది..కానీ బీబీ కేఫ్ లో వాళ్లంతా ఆమెను డి-గ్రేడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఎందుకు ?..శ్రీసత్య వలన అటు రేవంత్, ఇటు శ్రీహాన్ చాలా ఇబ్బంది పడుతున్నారు..ఇదేమీ కనిపించడం లేదా ? అని ఆరియానాని టార్గెట్ చేసి ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్స్.