English | Telugu

రక్తంతో పేరు రాసి ప్రపోజ్ చేసింది.. ఆ హీరో ఆమె నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడు!

శ్రీసత్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఫుల్ ఫేమస్ అయ్యింది. తిండి పిచ్చిది అని కూడా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడుది విజయవాడ.. స్టడీస్ మొత్తం ఇక్కడే పూర్తి చేసింది.. ఆ తర్వాత మిస్ విజయవాడ టైటిల్ , మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకునే సరికి ఆమెకు ఇండస్ట్రీ నుంచి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలా రామ్ పోతినేని నటించిన మూవీ 'నేను శైలజ'లో చిన్న రోల్ లో నటించింది. ఎన్నో వెబ్ సిరీస్ లో నటించింది.

ఆ తర్వాత ఆమెకు సీరియల్స్‌లో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, త్రినయని ఇలా బుల్లితెరపై కూడా కనిపిస్తూ అలరిస్తోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూలో తనకు రామ్ అంటే ప్రాణం అని "దేవదాస్" మూవీ నుంచి ఎంతో ఇష్టం అని చెప్పింది.

ఒక రోజు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఆ రక్తం వేస్ట్ కాకూడదని కొన్ని పేపర్స్ మీద తనకు ఇష్టమైన "రామ్" అనే పేరు రాసిందట. ఒక రోజు బీరువా సర్దేటప్పుడు ఆ పేపర్లు చూసిన వాళ్ళ అమ్మ బాగా తిట్టిందని చెప్పింది. ఎఫ్ టీవీ చూసి ఇంట్లో రాంప్ వాక్ చేసేదట. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అలాగే "ఫోన్ ఎడిక్ట్" అనే ముద్దు పేరు ఉందట ఎందుకంటే నిద్ర లేచి అద్దంలో ముఖం చూసుకున్నాక ఫుల్ డే ఫోన్ తోనే ఉంటుందట.

ఇన్స్టాగ్రామ్ అలా టైం ఫెవరేట్ అంది శ్రీ సత్య. అలాగే రామ్ గురించి ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పింది. ఇండస్ట్రీలో తనకు బాగా తెలిసిన ఒక్క అన్నయ్యకు రాఖీ కట్టినందుకు రామ్ నెంబర్ గిఫ్ట్ గా పంపించాడట. దాన్ని ట్రూ కాలర్ లో, జిమెయిల్ లో చెక్ చేసాక తెలిసిందట అదిరామ్ ఒరిజినల్ నెంబర్ అని. వెంటనే "ఐ లవ్ యు" అని మెసేజ్ పెట్టిందట. తన మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్స్ వచ్చాయట కానీ తన నెంబర్ ని బ్లాక్ చేసేశాడని చెప్పింది శ్రీ సత్య.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.