English | Telugu

ప్రేమించి మోసం చేసినవాడిని తలుచుకుని బాధపడుతున్న రష్మీ!

జబర్దస్త్ అంటే కొంత కాలం క్రితం వరకు యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ చూపించేవారు. ఇక ఈ ట్రాక్ కూడా నిజమేనేమో అనే రీతిలో ఉండేది వీళ్ళ నటన కూడా. వీళ్ళు ఎన్నో లవ్‌ సాంగ్స్ కి డాన్సులేస్తూ ఆడియన్స్ అదే ట్రాన్స్ లో ఉంచేసేవారు. అయితే కొన్ని రోజులుగా రష్మికి దూరమయ్యాడు సుధీర్‌. వేరే షోస్‌, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు సుధీర్ ప్లేస్ లో హోస్ట్ గా చేస్తోంది రష్మి. గతంలో ఒక సందర్భంలో తన లవ్ ఫెయిల్ అంటూ చెప్పింది రష్మి. ఇప్పుడు ఆమె ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంత బాధపడుతుందో అనే విషయాన్ని కళ్లకి కట్టినట్టు చూపించింది.

ప్రాణంగా ప్రేమించి అబ్బాయి పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్‌ ఆఫీస్‌ కి రమ్మని చెప్పి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... చేతిలో పూలదండతో ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కోసం పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ బాధను రష్మీ ఒక పాటలో చాలా ఎమోషనల్ గా చూపించింది. `అటు నువ్వే ఇటు నువ్వే.. `అంటూ సాంగ్ లో రష్మి చేసిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ అందరినీ కంట తడి పెట్టించింది. తర్వాత నాగినీడు చెప్పిన డైలాగ్‌ అందరి హృదయాలని కలచి వేసింది. బాధలోంచి వచ్చే ఎక్స్ ప్రెషన్స్ డెప్త్ వేరే లెవల్‌లో ఉంటాయన్నారు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి నెటిజన్లు సుధీర్ దూరం కావడమే తన బాధకు కారణమా ? అని పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక ఇదంతా `మన ఊరి దేవుడు` అనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌లోని దృశ్యాలు . వినాయకచవితి సందర్భంగా ఈ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ రాబోతోంది. ఇందులో రష్మి లవ్ ఫెయిల్యూర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌ గా నిలవబోతోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.