English | Telugu

నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే సుధీర్ ని పంపినట్టే నన్ను పంపించేస్తావ్!

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళను వదిలి సుధీర్ పక్క ఛానల్ కి వెళ్ళిపోయాడు. శీను, రాంప్రసాద్ ఇద్దరూ జబర్దస్త్ లో ఉండిపోయారు. సుధీర్ బాండ్ టైం ఐపోయింది కాబట్టి వెళ్లిపోయాడని, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు కాబట్టి వెళ్లిపోయాడని అంటున్నారు. కారణం ఏదైనా సుధీర్ స్టార్ మాలో మెరవడమే కాదు మూవీస్ లోనూ నటిస్తున్నాడు. సుధీర్ వెళ్లిపోయిన విషయం పై చంటి ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కప్పల పెళ్లి కాన్సెప్ట్ తో జరిగిన ఈ షోలోకి ఊరి జనం పేరుతో జబర్దస్త్ టీమ్ అంతా వచ్చేసింది. ఈ షోలో మొత్తం జబర్దస్త్ వాసన వస్తోందంటూ కౌంటర్లు వేస్తారు. ఊరి ప్రెసిడెంట్ గా తాగుబోతు రమేష్ చేసాడు. ఇక ఈ పెళ్ళికి చలాకి చంటి, రాఘవ వంటి వాళ్ళు వస్తున్నారని చెప్తాడు. ఈ మధ్య ఐశ్వర్య అంటూ ఒకాయన కలవరిస్తుంటాడు అంటూ రాఘవ పరువు తీసాడు ఆది. ఐతే అందరిలోకి ముందుగా బులెట్ భాస్కర్ మాట్లాడేసరికి "చూసావా అన్న..అందరికంటే సీనియర్ వి నువ్వు ఉన్నా కూడా మాట్లాడలేదు..వాడికి డైలాగ్స్ ఇవ్వకపోయినా మాట్లాడుతున్నాడు అంటూ బులెట్ భాస్కర్ గురించి చంటికి చెప్తాడు ఆది. కండలు పెంచు అన్నా అంటూ ఆది అనేసరికి రాంప్రసాద్ ఎంటరయ్యి అన్నా నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండు..నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటాడు.

కొన్ని సంవత్సరాలనుంచి ఫ్రెండ్ షిప్ చేసిన వాడినే నువ్వేం చేసావో నాకు తెలుసు.. నేను కూడా నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే భాస్కర్ కంటే భాస్కర్ చేసే దారుణాలకన్నా నీ దారుణాలే ఎక్కువగా ఉంటాయి.."అంటూ కౌంటర్లు వేసాడు చంటి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.