English | Telugu
Brahmamudi : కావ్య, రాజ్ కలిసి వేసిన డిజైన్స్ ని రాహుల్ చూస్తాడా!
Updated : Dec 1, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -892 లో.... అందరు భోజనం చేస్తుంటే రాహుల్ వస్తాడు. రాజ్ నీ కంపెనీ నుండి మేనేజర్ వచ్చాడు.. నా కంపెనీకి తీసుకున్నాను కానీ నీకు చెప్పలేదని రాహుల్ అనగానే అలా ఎలా చెప్పలేదు.. ముందే చెప్పాలి కదా అని సుభాష్ అంటాడు. పర్లేదు డాడీ వాడికి ఇప్పుడు అనుభవం ఉన్న మేనేజర్ కావాలని రాజ్ అంటాడు. నువ్వు అలా అన్ని లైట్ తీసుకోబట్టే కంపెనీ వెనక్కి వెళ్తుందని సుభాష్ అంటాడు. ఇప్పుడు దాని గురించే కావ్య నేను కష్టపడుతున్నాము మళ్ళీ నెంబర్ వన్ కి తీసుకొని వస్తామని రాజ్ చెప్తాడు. అది సరే గాని ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా అని అపర్ణ అడుగుతుంది.
హా అత్తయ్య అలారం పెట్టుకొని మీ ఆయన టైమ్ కి టాబ్లెట్స్ ఇచ్చాడని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య డిజైన్స్ వేస్తుంటే రాహుల్ వస్తాడు. ఈ టైమ్ లో ఎందుకు వచ్చావని కావ్య అడుగుతుంది. ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చానని రాహుల్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చూడడానికి లేదు నీ ఆలోచనలు నీవి.. మా ఆలోచనలు మావి.. ఇప్పుడు ఏమీ రెవిల్ చెయ్యమని రాజ్ చెప్తాడు. దాంతో రాహుల్ బయటకి వచ్చి అవేంటో చూసి నేను తీసుకుంటానని అనుకుంటాడు. మరొకవైపు అప్పు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. పాప పాధర్ వచ్చాడని, కానిస్టేబుల్ అప్పుకి చెప్తాడు. అప్పు కళ్యాణ్ తో చెప్పి ఇప్పుడు మనం స్టేషన్ కి వెళ్లాలని చెప్తుంది. మరొకవైపు రాజ్, కావ్య ఇద్దరు హాల్లోకి వస్తారు.
మేం గుడికి వెళ్లి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్తామని చెప్తారు. ఆ తర్వాత కళ్యాణ్, అప్పు బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. హాస్పిటల్ కి చెకప్ కి అని కళ్యాణ్ చెప్పి.. ఎలాగోలా అప్పుని బయటకు తీసుకొని వస్తాడు. మరొకవైపు రాజ్, కావ్య గుడికి వెళ్తారు. ఈ డిజైన్స్ దేవుడి దగ్గర పెట్టి ఇవ్వండి అని పంతులుకి కావ్య ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.