English | Telugu
ఎటో వెళ్ళిపోయింది మనసు ...సీతాకాంత్ కోసం ఆడియన్స్ వెయిటింగ్
Updated : Dec 7, 2023
స్టార్ మాలో వరుసగా కొన్ని సీరియల్స్ లైన్ లో ఉన్నాయి...సత్యభామ, ఊర్వశివో-రాక్షసివో అనే సీరియల్స్ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సీరియల్ కూడా ఆ లైన్ లోకి వచ్చి చేరింది. ఈ సీరియల్ కి సంబంధించి "కమింగ్ సూన్ ప్రోమో" రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సీరియల్ లో సీతాకాంత్ నటిస్తున్నాడు. "కలియుగ రామాయణం, ఇంద్రాణి" సీరియల్స్ లో ఆయన నటించాడు.
ఆ తరువాత " అమెరికా అమ్మాయి" అంతఃపురం" అనే సీరియల్ లో నటించి అభిమానుల నుంచి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక సీతాకాంత్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు "ఎటో వెళ్ళిపోయింది మనసు" సీరియల్ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 40 ఏళ్ళ వ్యక్తిగా అలాగే బిజినెస్ మాగ్నెట్ గా, అమ్మాయిలను హేట్ చేస్తూ పెళ్లి చేసుకోని ముదిరిపోయినా బ్రహ్మచారి రోల్ లో సీతాకాంత్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సీతాకాంత్ రోల్ కి సెట్ అయ్యేలా అందమైన కన్నడా అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె పేరు రక్షా నింబర్గి. ఉదయ టీవీ సీరియల్ ప్రీతియా అరసి సీరియల్ లో నటిస్తోంది. ఈమె తెలుగులో నటిస్తున్న ఫస్ట్ సీరియల్ ఇదే.
ఇక ఈ సీరియల్ లో ఫామిలీకి అన్నీ తానె అయ్యి చూసుకోవడం, ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా నిలబడడం అనేది ఆమె రోల్. ఇక ఈ 40 ఏళ్ళ పెర్ఫెక్షనిస్ట్ కి, 20 ఏళ్ళ అమ్మాయి రామలక్ష్మికి ముడిపడితే అనే కాన్సెప్ట్ లో ఈ సీరియల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఆల్రెడీ ప్రేమ ఎంత మధురం సీరియల్ కాన్సెప్ట్ కదా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.