English | Telugu

నబీల్ ఇమ్మెచుర్.. ఇచ్చిపడేసిన ప్రేరణ!

బిగ్ బాస్ హౌస్ లో గత వారం వరకు రెండు క్లాన్స్ ఉండేవి. వాటికి చీఫ్స్ ఉండేవారు. కానీ గత వారం నుండి హౌస్ మొత్తానికి ఒక్కడే మెగా చీఫ్ అతడే నబీల్. టాస్క్ లు నబీల్ గెలిచి మొదటి మెగా చీఫ్ అయ్యాడు. మొదటి నుండే నబీల్ ఫై హౌస్ మేట్స్ అందరికి మంచి ఇంప్రెషన్ ఉంది. మెగా చీఫ్ గా కూడా అందరితో బాగా ఉంటూ బాధ్యతలు చెప్తూ.. తను బాధ్యతగా ఉంటున్నాడు నబీల్.

అయితే ఓజీ టీమ్, రాయల్స్ టీమ్ కి మధ్య జరిగిన టాస్క్ లో.. ఓజీ టీమ్ మేట్స్ లో వాళ్ళలో వాళ్లకే బేధాభిప్రాయాలు వచ్చాయి. నన్ను అసలు టాస్క్ లు వస్తే కన్సిడర్ చెయ్యడం లేదు.. నేను నామినేషన్ లో ఉన్నానని నబీల్ ఫై యష్మీ కోపంగా ఉంది. దాంతో పాటు నిన్న రోజు జరిగిన ఎపిసోడ్ లో ప్రేరణ, నబీల్ లు ఇద్దరు.. అసలు సమస్య ఏంటి ఎక్కడ మొదలైందని చర్చించుకుంటారు. అసలు ఏమైంది ఇప్పుడిప్పుడే కొంచెం బాండింగ్ అవుతుందనుకున్నాను కానీ అసలు నా మాట కూడా వినట్లేదు చాలాసార్లు నబీల్ అని ప్రేరణ అంటుంది. అసలు నేను చెప్తుంటే రియాక్ట్ కూడా అవ్వవని ప్రేరణ చెప్తుంది. ఆ విషయాన్ని నబీల్ చాలా కూల్ గా డీల్ చేస్తుంటే.. నువ్వు ఇమ్మెచుర్(Immature) అంటూ ఒకటి పది సార్లు అంటుంది. ఇక అలా ప్రేరణ అంటుంటే నబీల్ కి బీపి పెరిగిపోయింది. ఐ యమ్ నాట్ ఇమ్మెచుర్ అని నబీల్ గట్టిగా అరుస్తాడు. గేమ్ ని గేమ్ గా చూడాలని అక్కడే ఉన్న పృథ్వీ వాళ్లకు చెప్తుంటాడు.

ఆ తర్వాత నబీల్, ప్రేరణ విషయం సోఫాలో ఉన్నా విష్ణు సీతలకి చెప్తుంటాడు. ప్రొద్దున పాల ప్యాకెట్ విషయంలో ఇలా చేసి వెటకారంగా మాట్లాడిందంటూ చెప్పుకొచ్చాడు. అదంతా గమనిస్తున్న ప్రేరణ పక్కనే ఉన్న పృథ్వీతో.. నీకు నబీల్ మెగా చీఫ్ నచ్చిందా అని అడుగుతుంది. బానే ఉందని అతను అంటాడు. నాకు నచ్చలేదు ఇమ్మెచుర్.. డెసిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు.. చిన్నపిల్లల మెంటాలిటీ అని ఇదే విషయం చెప్పాను.. చూడు ఈ విషయం అందరికి చెప్తున్నాడని ప్రేరణ అంటుంది. దీంతో ఈ ఇష్యూ ప్రేరణ, నబీల్ లు వీకెండ్ రాకముందే నామినేషన్ కి శ్రీకారం చుట్టారు. ఈ ఇష్యూపై నామినేషన్ లో వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...