English | Telugu

‘నీతోనే డాన్స్’.. సరికొత్త డాన్స్ షో త్వరలో...

డాన్స్ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్ట్ మాలో సరికొత్త డాన్స్ షో రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ కొత్త డాన్స్ షో పేరు "నీతోనే డాన్స్" . బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి ఎలా వచ్చి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి ఇండికేషన్ గా సీరియల్ యాక్టర్స్ నిఖిల్-కావ్య చేసిన డాన్స్ నే ప్రోమోగా రిలీజ్ చేశారు. ఈ ఇద్దరూ ఐస్ క్రీం తింటూ అలా నడుస్తూ వస్తుంటే వర్షం స్టార్ట్ అవుతుంది. "నీకు గుర్తుందా..ఫస్ట్ టైం మనం కలిసి ఐస్క్రీమ్ తినేటప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది..ఆ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే ఇంకేం జరుగుతుందో" అని కావ్య అనేసరికి "ఇంకేం జరుగుతుంది...మాజికల్ గా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అవుతుంది" అని చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత కురిసిన వర్షంలో "ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి క్యూట్ గా డాన్స్ చేశారు. ఇప్పటి వరకు మనం అన్ని చానెల్స్ లో రకరకాల డాన్స్ షోస్ చూస్తూనే ఉన్నాం. ఈటీవీ లో "ఢీ" ఇప్పటివరకు 15 సీజన్స్ పూర్తి చేసుకుంది...అలాగే ఆహా ఓటిటి మీద "డాన్స్ ఐకాన్" షో , జీ తెలుగులో "డాన్స్ ఇండియా డాన్స్" ఎన్నో చూసాం. బీబీ జోడి ప్రత్యేకంగా బీబీ కంటెస్టెంట్స్ మధ్య నిర్వహించారు కదా అలాగే ఈ ప్రోమో చూస్తుంటే సీరియల్ యాక్టర్స్ మధ్యన నిర్వహిస్తున్నారా అనిపిస్తోంది.

ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు "కరెక్ట్ డాన్స్ జోడితో ప్రోమో స్టార్ట్ చేశారు...క్యూట్ ప్రోమో" అంటున్నారు. ఐతే బుల్లితేర మీద జోడి కపుల్స్ గా గుర్తింపు పొందారు కొంతమంది నిఖిల్-కావ్య, అమరదీప్-తేజు, మహేష్-కీర్తిభట్, నవ్యస్వామి-రవికృష్ణ ఇలా చెప్పుకుంటే స్క్రీన్ మీద హిట్ పెయిర్స్ చాలా మంది ఉన్నారు. మరి ఈ హిట్ పెయిర్స్ ని తీసుకొస్తారా...లేదంటే ఇంకేమన్నా కొత్తగా ప్లాన్ చేశారా అనే విషయం తెలియాలంటే నెక్స్ట్ అప్ డేట్ కోసం కొంచెం వెయిట్ చేయాలి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.