English | Telugu

అంత ఓపిక, తీరిక లేదు...

టాలీవుడ్ లో ఉన్న ప్లే బ్యాక్ సింగర్స్ లో చెప్పుకోదగ్గ పేరు లిప్సిక..మూవీస్ లో ఎన్నో సాంగ్స్ పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎంతో మంది హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. వీటికన్నిటికంటే కూడా సోషల్ మీడియాలో చెప్పే మోటివేషనల్ వాక్యాలకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. అలాంటి లిప్సిక "చాలా గ్యాప్ వచ్చేసింది మనం మాట్లాడుకుని" కాబట్టి "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అంటూ ఇన్స్టాగ్రామ్ పేజీలోని ఫాన్స్ కి, ఆడియన్స్ కి, నెటిజన్స్ కి అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా జోష్ తో చాలా ప్రశ్నలే అడిగారు.."మీరు చాలా సింపుల్ గా ఉంటారు కారణమేంటి" " మెయింటైన్ చేసేంత ఓపిక, తీరిక లేదు...నాకంత సినిమా లేదు...అందుకే సింపుల్ గా ఒక లిప్ స్టిక్ మాత్రమే పెట్టుకుంటా" అని చెప్పింది.

"మీ జీవితంలో ఇష్టమైన పర్సన్ ఎవరు" "ఇంకెవరూ భరిస్తాడు కాబట్టి మొదట నా భర్త ఉదయకిరణ్ అంటే ఇష్టం..మిగతా వాళ్లంతా తర్వాత" అని ఆన్సర్ చేసింది. "డైట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం" అని ఒక డైటీషియన్ అడిగిన ప్రశ్నకు "డైట్ స్టార్ట్ చేసే టైం వచ్చింది...ఈ వీక్ పక్కా" అని చెప్పింది. "ఒక పాట పాడితే ఎంత ఇస్తారు" " మీరెంత అనుకుంటున్నారు" అని రివర్స్ లో మళ్ళీ క్వశ్చన్ వేసేసింది. "ఎలా ఉన్నారు..మీ ట్రిప్ ఎలా జరిగింది" అనేసరికి "ట్రిప్ చాలా అమేజింగ్" అంటూ గుర్రం మీద స్వారీ చేసే వీడియో పోస్ట్ చేసింది. "నా ప్రేమ విషయంలో నా వైపు నుంచే ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నట్లు అనిపిస్తోంది" అనేసరికి "కొంచెం స్పేస్ ఇవ్వండి...మీరు స్పేస్ తీసుకోండి...చెప్పాలనుకున్న విషయం చెప్పి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి.." అంటూ మోటివేట్ చేసింది. ఇలా తన ఫాన్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్స్ ఇచ్చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.