Read more!

English | Telugu

ఉత్కంఠభరితంగా కృష్ణ ముకుంద సీరియల్.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఓ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-165లో.. నీ దారి నువ్వు చూసుకోమని ముకుందతో మురారి చెప్పి కార్ లో ఇంటికి తీసుకొస్తాడు. అలా కార్ లో వస్తున్నప్పుడు మురారి  తనతో అనేసిన మాటలన్నీ గుర్తుచేసుకుంటూ ఏడుస్తుంది ముకుంద. మరోవైపు కృష్ణ ఒక్కతే తన గదిలో ఉన్న వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. మా అగ్రిమెంట్ అయిపోతుంది నాన్న.. ఏసీపీ సర్ వెళ్ళిపోమంటే నేనేం చేయాలి.. నేనొక్కదాన్నే ఉండాలా? అలా కృష్ణ ఒంటరిగా మిగిలిపోయిందని అందరూ అనుకుంటారేమో అని కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. అప్పుడే మురారి వస్తాడు.

ఆ తర్వాత మురారితో కృష్ణ.‌ నేను మాట్లాడింది విన్నారా అని అడుగగా.. నువ్వేమైనా మాట్లాడావా అని అడుగుతాడు మురారి. తర్వాత మురారి తన బెడ్ మీద కూర్చొని.. కృష్ణ ఒక గరమ్ ఛాయ్ తీసుకురావా ప్లీజ్ అని అంటాడు. అయ్యో ఏసీపీ సర్ మీరు అలా అంటే నేను తీసుకురాను.. మీ స్టేషన్ లో కానిస్టేబుల్ ని ఆర్డర్ వేస్తారు కదా అలా చెప్పండి అప్పుడు తీసుకొస్తానని కృష్ణ అంటుంది. నేను మా కానిస్టేబుల్ తో కూడా ఇలాగే మాట్లాడుతానని మురారి అంటాడు.

ఆ తర్వాత కృష్ణ ఛాయ్ తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే ముకుంద తనకి ఎదురుపడుతుంది. దాంతో కృష్ణ ముకుందని చూస్తూ కళ్ళు ఎగరేస్తుంది. ఏంటి కృష్ణ నన్ను చూసి కళ్ళు ఎగరేస్తావా? ఏం అనుకుంటున్నావని ముకుంద కోప్పడుతుంది ‌ దాంతో నా ఇష్టమని.. నీకు నచ్చింది నువ్వు చేసుకో అని కృష్ణ అంటుంది. అయితే వీళ్ళు ఇలా గొడవపడేదంతా కృష్ణ వాళ్ళ మరిది వీడీయో తోస్తాడు. ఇలానే కొట్టుకోండి.. ఇంకా తిట్టుకోండని అతను అనగా.‌. కృష్ణ, ముకుందలు మళ్ళీ మాములు అయిపోతారు. కాసేపటికి తమ గదిలో ఒంటరిగా ఉన్న ముకుంద వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి సలహా  ఇవ్వమని అడుగుతుంది.

ముకుంద వాళ్ళ ఫ్రెండ్ గట్టిగా ప్రయత్నించు.. లేదంటే డైవర్స్ తీసుకొని ఆ ఇంట్లో నుండి వచ్చేయ్.. నీకు అందం లేదా? ఆస్తి లేదా అని అంటుంది. అవును నిజమే.. డైవర్స్ వరకయ కరెక్టే కానీ మురారిని వదిలిరాలేను అని ముకుంద అంటుంది. ఆ తర్వాత మురారిని దక్కించుకోవాలంటే నేను గట్టిగా ప్రయత్నించాలని ముకుంద అనుకుంటుంది. మరోవైపు మురారి కోసం ఛాయ్ తీసుకొస్తుంది కృష్ణ. అయితే ఆ ఛాయ్ చల్లారిపోయింది.. నేను తాగను.. ఛాయ్ లాగే నాకు తాగాలనే ఆలోచన కూడా చల్లారిపోయిందని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ గోడకి ఉన్న యశోద కృష్ణుడిని ఎత్తుకున్న ఫోటో చూస్తుంటుంది. అప్పుడే కృష్ణ వాళ్ళ మరిది వచ్చి తనని ఫోటోలు తీస్తాడు. అవన్నింటికి పోయిలో వేసి కాల్చేస్తానని కృష్ణ అంటుంది. కాసేపటికి మురారి అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.