English | Telugu
పల్లవి గౌడ ‘నిండు నూరేళ్ళ సావాసం’ ఎప్పుడంటే!
Updated : Aug 9, 2023
టెలివిజన్ రంగంలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించేది స్టార్ మా టీవీ, జీ తెలుగు సీరియల్స్.. వీటిల్లో బాగా పాపులర్ అయినవి చాలానే ఉన్నాయి. స్టార్ మా టీవీలో బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి, గుప్పెడంత మనసు, గృహలక్ష్మి, మల్లి, నాగపంచమి ఉండగా.. జీ తెలుగులో రాధమ్మ కూతురు, రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ పాపులర్ అయ్యాయి.
పసుపు కుంకుమ, సావిత్రి మొదలైన సీరియల్స్ లో నటించిన పల్లవి గౌడ అందరికి సుపరిచితమే.. అయితే కొన్ని సంవత్సరాలుగా రెస్ట్ తీసుకున్న పల్లవి గౌడ.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా చేసిన సీరియల్... 'నిండు నూరేళ్ళ సావాసం'. పల్లవి గౌడ కన్నడ నటి.. తెలుగులో పసుపు కుంకుమ, సావిత్రి సీరియల్స్ చేసిన తర్వాత కన్నడలో గాలిపాట, పరిణయ, శాంతం పాపం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో చదరంగం, సూర్యకాంతం సీరియల్స్ లో నటించింది పల్లవి గౌడ. అయితే సీరియల్స్ తో పాటు పలు కన్నడ సినిమాలలో నటించిన పల్లవి గౌడ.. రెండు రాష్ట్రాలు, అమ్మ ఆవకాయ అంజలి లాంటి తెలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 'నిండు నూరేళ్ళ సావాసం' తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది పల్లవి గౌడ.
తన కుటుంబమే శ్వాసగా.. ప్రేమకు చిరునామాగా.. అమాయకత్వమే ఆభరణంగా.. అందరిలో కనిపించే రూపమే మన అరుంధతి అంటూ పల్లవి గౌడ ఈ సీరియల్ లో పరిచయమవుతుంది. కాగా ఆమె భర్త మిలటరీలో చేసే సైనికుడు.. అతని పేరు అమరేంద్ర.. అయితే పల్లవి గౌడ ఒక ఆత్మ పాత్రలో కనిపిస్తుంది. అయితే తను చనిపోయాక పిల్లల సంరక్షణ కోసం అమరేంద్ర భాగమతి అనే అమ్మాయిని అపాయింట్ చేస్తాడు. అయితే ఆటలు, పాటలతో గడిచే పిల్లల బాల్యం భాగమతి చేతిలో ఉంది. మరి అమ్మ లేని లోటుని భాగమతి తీర్చగలదా.. చూడాలంటే అగస్ట్ 14 వ తేదీన ప్రారంభమ్యే ఈ సీరియల్ చూడాల్సిందే.