English | Telugu

Karthika Deepam2 : నువ్వు పనిమనిషి కూతురివి.. షాక్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -139 లో.... వచ్చాక ఒక విషయం చెప్తానని కార్తిక్ కి ఫోన్ లో చెప్తుంది దీప. ఆ తర్వాత శౌర్య వచ్చి అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతుంది. హా ఇప్పుడే చేసింది బయలుదేరారట.. ఆలోపు మనం సరదాగా బయటకు వెళదామని శౌర్యని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర దాస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. పారిజాతం వెళ్తుంటే.. అత్తయ్య మీతో జ్యోత్స్న గురించి మాట్లాడాలని అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి నా గురించి గ్రానీ తో ఎందుకు మాట్లాడ్డడమని జ్యోత్స్న అంటుంది. చిన్నచిన్న పొరపాట్లకి కూడ ఒక్కొక్కసారి పెద్ద శిక్ష పడుతుందని సుమిత్ర అనగానే.. అవును దీప నిన్ను కాపాడిందని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే.. ఇప్పుడు నాకే తలనొప్పిగా తయారైందని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత నీ గురించి తెలిసినవాళ్లే కాదు ఒక్కరోజు నీతో ఉన్నా.. నీ గురించి తెలుస్తుంది. దాస్ ఎవరిని ఏం అనడివాడు.. నా పెంపకం బాలేదు అన్నాడని సుమిత్ర అనగానే.. వాడు ఎవడు నా గురించి మాట్లాడడానికి అని జ్యోత్స్న కోప్పడుతుంది. అన్న వాళ్ళపై అరవడం కాదు తప్పుని సరిదిద్దుకోవాలని సుమిత్ర అంటుంది. నీ కొడుకు ఎక్కడ గ్రానీ అంటు జ్యోత్స్న కోపంగా వెళ్తుంది.‌ ఆ తర్వాత రోడ్డు మీద స్పీడ్ గా వెళ్తున్న జ్యోత్స్నకి దాస్ ఎదురుపడతాడు. నేను ఎలా ఉండాలో మా మమ్మీతో చెప్పడానికి.. నువ్వు ఎవరని దాస్ ని నిలదీస్తుంది జ్యోత్స్న. నీ కొడుకుతో రాఖీ కట్టించుకున్నా అని నిన్ను బాబాయ్ అనుకోవట్లేదు.. ఏదో మా బావ కోసం మిమ్మల్ని భరించమని జ్యోత్స్న అంటుంది. నా ప్రవర్తన, పద్ధతుల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరని జ్యోత్స్న అనగానే.. నన్ను ఎవరు అంటున్నావ్.. అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా అని దాస్ అంటాడు. నేనెవరో నాకు తెలియకపోవడమేంటని జ్యోత్స్న అనగానే.. వచ్చి కార్ ఎక్కు నువ్వు ఎవరో.. నేను ఎవరో అంతా చెప్తానని దాస్ అంటాడు.

మరొకవైపు దీప, అనసూయలు శౌర్యకి సైకిల్ తీసుకొని వస్తుంటారు. ఇకనుండి మనకి ఏం సమస్య లేదని దీప అనగానే.. అప్పుడే ఒక స్వామి వచ్చి.. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది.. నువ్వు శ్రీమంతుల బిడ్డవు.. నువ్వు చేరవలసిన చోటుకే చేరావని అనగానే.. అంటే దీప శ్రీమంతుల బిడ్డనా అని అనసూయ మనసులో అనుకుంటుంది. అవును నువు అనుకుంది నిజమేనని స్వామి అనగానే.. అనసూయ షాక్ అవుతుంది. స్వామి వెళ్ళిపోయాక మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అనసూయని దీప అడుగుతుంది. ఆ రోజు పిండం పెట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడ బ్రతికి ఉన్నవాళ్ళకి పిండం పెడితే ముట్టవన్నాడు. అసలు నా తండ్రి కుబేరేనా అని దీప అనగానే.. అంటే దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అన్నమాట అనుకుంటుంది. కుబేర్ తన తండ్రి కాదన్న విషయం దీపకి అనసూయ చెప్పకుండా డైవర్ట్ చేస్తుంది. మరొకవైపు జ్యోత్స్నని చిన్నప్పుడు తను పుట్టిన హాస్పిటల్ కి తీసుకొని వచ్చి నిజం చెప్తాడు దాస్‌. సుమిత్ర గారి కూతురిని మార్చేశి పనిమనిషి కూతురిని ఆ ప్లేస్ లో పెట్టారు. ఆ పనిమనిషి నా భార్య.. అంటే నువ్వు నా కూతురివి అని దాస్ అనగానే.. నో అంటూ జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.