English | Telugu

Eto Vellipoyindhi Manasu : అర్థరాత్రి భార్యాభర్తల ముచ్చట్లు.. అత్త మాస్టర్ ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -191 లో.....రామలక్ష్మి శ్రీలత గదిలోకి వెళ్లి పడుకుంటుంది. దాంతో సీతాకాంత్ లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. తన పక్కన రామలక్ష్మి ఉందని ఉహించుకొని తన మనసులో మాటలు చెప్తుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఏంటి మనవడా నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. తాతయ్య నువ్వా అంటూ సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తాడు. అందుకే నీ మనసులో మాటని నీ భార్యకి చెప్పమని చెప్పానంటూ పెద్దాయన అంటాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి.. అమ్మ దూరంగా ఉండమని చెప్పింది కదా అని సీతాకాంత్ అంటాడు.

మీ అమ్మ కలిసి ఉండకూడదు అంది కానీ మాట్లాడుకోకని చెప్పలేదు కదా ఇప్పుడు వెళ్లి నీ మనసులో మాటని రామలక్ష్మికి చెప్పమని పెద్దాయన అనగానే సీతాకాంత్ సరే అంటాడు. మరొకవైపు నందిని ఫోటో షూట్ కోసం సీతాకాంత్ కి సూట్ తీసుకంటుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంటే.. అప్పుడే హారిక వస్తుంది. నువ్వు కొన్నావ్ సరే తను వేసుకుంటాడా అని అడుగుతుంది. తనకి నాపై ప్రేమ ఉంది ఖచ్చితంగా వేసుకుంటాడని నందిని అంటుందిమ. నందిని అలా సీతాకాంత్ పై ప్రేమ చూపించడం చూసి ఆశ్చర్యపడుతుంది. ఆ తర్వాత శ్రీలత పైన పడుకుంటానని లేస్తుండగా అప్పుడే సీతాకాంత్ డోర్ కొడతాడు. దాంతో మళ్ళీ వెంటనే వెళ్లి పడుకుంటుంది. సీతాకాంత్ డోర్ తీసి పేపర్స్ తో రామలక్ష్మిని నిద్ర లేపుతాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి లేచి సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఏంటని అడుగుతుంది. నీతో మాట్లాడాలి పద అంటూ బయటకు తీసుకొని వస్తాడు.రామలక్ష్మితో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. అది తప్ప అన్నీ మాట్లాడతాడు. మరొకవైపు వెళ్లేంటి ఇంకా రావడం లేదని శ్రీవల్లి దగ్గరికి శ్రీలత వెళ్లి.. నిద్రలేపి రామలక్ష్మిని గదిలో నుండి సీతా బయటకు తీసుకొని వచ్చాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్లు మాత్రం కలవకుండా చూడమని శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత సందీప్ ని శ్రీవల్లి నిద్ర లేపి బలవంతంగా బయటకు తీసుకొని వస్తుంది. సీతాకాంత్ రామలక్ష్మిలు కూర్చొని ఉన్న దగ్గరే శ్రీవల్లి, సందీప్ లు కూర్చొని ఉంటారు. సీతాకాంత్ తన ప్రేమ విషయం చివరికి ధైర్యం చేసి చెప్తుంటే.. అప్పుడే సందీప్ తో శ్రీవల్లి మాట్లాడడం వినిపిస్తుంది. అది విని సీతాకాంత్ చెప్పకుండా ఆగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.