English | Telugu

మోనిత క్రూర‌త్వం.. ఆనంద‌రావు ప‌రిస్థితేంటీ?

గ‌త కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ డైలీ సీరియ‌ల్ టాప్ రేటింగ్ తో కొన‌సాగుతూ ప్ర‌తీ ఎపిసోడ్ ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ గురువారం 1254వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు మోనిత మ‌ళ్లీ త‌న క్రూర‌త్వాన్ని బ‌య‌ట పెట్ట‌బోతోందా?.. త‌న వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌మాదం జ‌ర‌గ‌బోతోందన్న‌ది ఈ రోజు హైలైట్ గా నిల‌వ‌బోతోంది.

ఇంటికి వ‌చ్చిన దీప.. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల గురించి ఆలోచిస్తూ వుంటుంది. 'అస‌లు ఏమ‌య్యింది?.. మ‌మ్మ‌ల్ని వెతుక్కుంటూ వ‌చ్చారా? లేక ఏదో జ‌రిగే వ‌చ్చారా?' అని మ‌న‌సులో దీప కంగారు ప‌డుతూ వుంటుంది. ఇదిలా వుంటే కార్తీక్ ఆశ్ర‌మానికి వెళ్లి అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ వ్య‌క్తిని `ఇద్ద‌రు పెద్ద‌వాళ్లు వ‌చ్చారు క‌దా.. వాళ్లు ఎందుకు ఇక్క‌డికి వ‌చ్చారు? .. ఆ పెద్దాయ‌న‌కి ఏం స‌మ‌స్య వ‌చ్చింది?' అని ఆరాతీస్తాడు. 'మీకు వాళ్లు తెలుసా?.. మీరు వాళ్ల‌కి తెలుసా?' అంటూ అత‌ను ప్ర‌శ్న‌లు వేస్తాడు. దీంతో కార్తీక్ స‌మాధానం చెప్ప‌లేక అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు.

Also Read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం!

క‌ట్ చేస్తే.. 'కార్తీక్ ఎలా వ‌స్తాడు? ఆనంద‌రావు అంకుల్ ని ఆశ్ర‌మంలో ఎందుకు జాయిన్ చేశారు.. ఒక వేళ ఆనంద‌రావు అంకుల్ టపా క‌ట్టేస్తే కార్తీక్ ఎక్క‌డున్నా వ‌చ్చేస్తాడు క‌దా..` అంటూ మోనిత క్రూరంగా ఆలోచించ‌డం మొద‌లుపెడుతుంది. సారీ అంకుల్ అనుకుంటూనే 'నిజ‌మే క‌దా ఆనందరావు అంకుల్ పోతే కార్తీక్ ఎక్క‌డున్నా వ‌చ్చి తీర‌తాడు. అప్పుడే నేను ఆ ఇంటి కోడ‌ల్నే కాబ‌ట్టి నేను అక్క‌డే వుంటాను. కార్తీక్ ని ప‌ట్టుకోవ‌చ్చు..' అని మోనిత త‌న క్రూర‌మైన ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్ట‌డం మొద‌లుపెడుతుంది.ఇంత‌కీ మోనిత ఏం ఆలోచించింది. ఆనంద‌రావు ప‌రిస్థితేంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.