English | Telugu

`జ‌బ‌ర్ద‌స్త్` నుంచి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయా?

బుల్లితెర కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. దీనికి కొన‌సాగింపుగా `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షోని కూడా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ షోలో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, గెట‌ప్ శ్రీ‌ను, ఆటో రాంప్ర‌సాద్, శాంతి స్వ‌రూప్ వంటి వారు స్కిట్ లు చేస్తూ న‌వ్విస్తున్నారు. ఈ షోతో వీరంతా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో స్కిట్ లు చేసిన మిగ‌తా వారంతా పోయి కొత్త వారు ఎంట‌ర‌య్యారు. ఇమ్మానుయేల్‌, వ‌ర్ష వంటి వారు కొత్త‌గా వ‌చ్చి చేర‌డంతో పాత వారికి ప‌నిలేకుండా పోయింది.

దీంతో గ‌తంలో ఈ వేదిక‌పై న‌వ్వించిన వారంతా తెర‌మ‌రుగ‌య్యారు. ఇప్పుడు వారికి నాగ‌బాబు, శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న `కామెడీ స్టార్స్ ధ‌మాకా` అడ్డాగా మార‌బోతోంది. `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షోల‌లో ఆక‌ట్టుకుని హైప‌ర్ ఆది టీమ్ కు అండ‌గా నిలిచిన అభి కొత్త‌గా `కామెడీ స్టార్స్ ధ‌మాకా` లోకి ఎంట్రీ ఇచ్చాడు. త‌న టీమ్ తో కొత్త త‌ర‌హా స్కిట్ ల‌తో హంగామా చేస్తున్నాడు. ఇత‌ని త‌ర‌హాలోనే `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` షో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అప్పారావు, రాజ‌మౌళి, జీవ‌న్ `కామెడీ స్టార్స్ ధ‌మాకా` లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

వీరంద‌రి రాక‌తో `కామెడీ స్టార్స్ ధ‌మాకా` ని స‌రికొత్త‌గా ప్లాన్ చేసిన మేక‌ర్స్ ఈ నెల 23 నుంచి ప్ర‌త్యేకంగా మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్రారంభించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ షో కు సంబంధించిన మ‌రో విశేషం ఏంటంటే `కామెడీ స్టార్స్` కి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన శ్రీ‌ముఖి ని ప‌క్క‌న పెట్టేసి `కామెడీ స్టార్స్ ధ‌మాకా` కోసం దీపిక పిల్లిని రంగంలోకి దించేశారు. దీంతో ఈ షో ఓ రేంజ్ లో `జ‌బ‌ర్ద‌స్త్‌`, `ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్` స్టార్స్ తో హోరెత్తించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.