ధనుష్, ఐశ్వర్యను కలిపేందుకు రజనీ విఫలయత్నం!
on Jan 19, 2022
పద్దెనిమిది సంవత్సరాల బంధానికి స్వస్తిచెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్యా రజనీకాంత్. తాము విడిపోతున్న విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు ధనుష్. దీంతో వారి అభిమానులతో పాటు దేశంలోని సినీ ప్రియులంతా షాక్‌కు గురయ్యారు. ధనుష్ ప్రకటించేంత దాకా వారిమధ్య దూరం పెరిగిందనే విషయం ఏమాత్రం బయటకు పొక్కకపోవడమే దీనికి కారణం.
ఎప్పుడో పదేళ్ల క్రితం '3' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్‌తో ధనుష్ సన్నిహితంగా మెలగుతున్నాడంటూ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అయితే చాలా త్వరగానే ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. తమ మధ్య బంధం చాలా గట్టిదన్నట్లుగా అప్పుడు ధనుష్, ఐశ్వర్య వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వారి అనుబంధం పలుచనవుతున్నదనే చిన్న వార్త కూడా బయటకు రాలేదు. అంత అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చారు ఆ ఇద్దరూ.
Also read: ధనుష్-ఐశ్వర్య ఎందుకు విడిపోయారు?
అయితే ఇప్పుడు ధనుష్ ప్రకటన తర్వాత కోలీవుడ్‌లో రెండు నెలల నుంచే వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటూ ప్రచారంలోకి వచ్చింది. కుమార్తెను, అల్లుడిని కలిసి కూర్చోపెట్టుకొని వారి మధ్య గొడవను పరిష్కరించడానికి తలైవా రజనీకాంత్ ప్రయత్నించారనీ, అయినా వారు వినలేదనీ చెప్పుకుంటున్నారు. వారు విడిపోతున్న విషయం అప్పట్నుంచే రెండు కుటుంబాలకూ తెలిసినా, దానిని బయటపెట్టకుండా ఇంతదాకా గుంభనంగా వ్యవహరించారని సమాచారం.
Also read: ధనుష్, ఐశ్వర్య మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వ్యక్తిగత జీవితం కూడా గతంలో ఒకసారి ఇలాగే కుదుపుకు లోనైంది. మొదటి భర్త రామ్‌కుమార్‌కు విడాకులిచ్చిన ఆమె, విశాఖన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా భర్త ధనుష్ నుంచి విడిపోయింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
