English | Telugu

అర్థరాత్రి పబ్బుల్లో చిందులేసిన బిగ్ బాస్ జోడి!

సిటీ కల్చర్ లో భాగంగా రాత్రి వేళల్లో సెలబ్రిటీలు పబ్ , రేవ్ పార్టీ, ధావత్ అంటు తెగ తిరిగేస్తుంటారు. బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ సీజన్ లో చైతు, అరియాన, తేజస్విని, ఆర్జే కాజల్ కంటెస్టెంట్స్ గా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళ ముగ్గురు కలిసి నానా సందడి చేశారు. ఇక ఆ బాండింగ్ వీరిమధ్య అప్పటి నుండి అలానే ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరెలా ఉంటారో? ఏ టాస్క్ లో ఎవరెలా మారిపోతారో తెలియదు. అప్పటిదాకా ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్ళు టాస్క్ ని సీరియస్ గా తీసుకొని దూరమైన రోజులు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్జే చైతుని తేజస్విని నామినేట్ చేసి ఓ చెత్త రీజన్ చెప్తుంది‌. దానికి చైతు ఫీల్ అయిపోయాడు. ఆ తర్వాత వారిమధ్య దూరం పెరిగింది. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దాంతో అరియానా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు.అరియానా అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వళ్ళ అరియనాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది.

అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత RGV తో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియానా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈ మధ్య ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్ దీప్ కి సపోర్ట్ చేసిన అరియానాకి తెగ ట్రోల్స్ వచ్చాయి. ఎప్పుడు బోల్డ్ అండ్ హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళ మతిపోగోట్టే ఈ భామ.. ఇప్పుడు ఆర్జే చైతుతో కలిసి నైట్ పబ్ లో డ్యాన్స్ చేసింది. అదీ మాములు పాట కాదు. ఐటమ్ సాంగ్.. రెడ్ డ్రెస్ లో హాట్ స్టెప్పులతో ఇరగదీసింది. ఇక ఇది తనకు మర్చిపోలేని రోజు అంటు తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది ఈ భామ.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.