English | Telugu

సౌమ్య రావు మీద ఇంద్రజ సీరియస్... రాఘవ వెళ్ళిపోయాడు!

ఉగాది వెళ్ళిపోయింది.. శ్రీరామ నవమి మరి కొద్ది రోజుల్లో రాబోతోంది. ఇక బుల్లితెర మీద షోస్ అన్నీ కూడా ఈ పండగ స్పెషల్ తో పానకంలా తియ్యగా ఎంటర్టైన్ చేయడానికి సరికొత్తగా ముస్తాబై వచ్చేయడానికి రెడీ ఐపోయాయి. అందులో భాగంగానే జబర్దస్త్..ఖతర్నాక్ కామెడీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో స్కిట్స్ అన్నీ కూడా మస్త్ అలరించబోతున్నాయన్న విషయం ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. రాఘవ స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "ధైర్యానికి మనిషి రూపం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ? ఎవరు అడుగేస్తే నేల అమెరికా వరకు అదురుతుందో తెలుసా ? అంటూ టీవీలో వచ్చే యాడ్స్ లా కొటేషన్స్ చెప్తూ ఉండగా వైట్ హెయిర్ తో రాఘవ గన్ తీసుకుని "డాన్ సుబ్బారావుగా" ఎంట్రీ ఇచ్చేసాడు.

"అన్నా ఇది పాన్ ఇండియా స్కిట్" అని చెప్తూ ఒక విలన్ నవ్వు నవ్వాడు. రాఘవ ఒక వ్యక్తి చంపబోయేటప్పుడు అతని భార్య వచ్చి "చారులోకి కొత్తిమీర నీ తాత తెస్తాడా.." అని సీరియస్ గా అడిగేసరికి "డాన్ ని పట్టుకుని కొత్తిమీర తెమ్మంటావా" అని సీరియస్ అయ్యాడు రాఘవ " డాన్ ఐతే మొగుడు కాదా మగాడు కాదా" అని గట్టిగా భార్య అరిచేసరికి రాఘవ కళ్ళు తిరిగి కిందపడిపోయాడు. ఇక హోస్ట్ సౌమ్య రావు ఈ మధ్య స్కిట్స్ లో బాగా యాక్టివ్ గానే పెర్ఫార్మ్ చేస్తోంది. ఇందులో కూడా "అందాలలో మహోమహోదయం" సాంగ్ వస్తుంటే దేవకన్యలా డాన్స్ చేసింది. ఇలా స్కిట్స్ అన్ని జరిగాక ఫైనల్ గా "ఒక మంచి టేస్టీ పానకం చేయాలి" అంటూ కమెడియన్స్ కి టాస్క్ ఇచ్చింది యాంకర్. నూకరాజు తయారు చేసిన పానకాన్ని ఇంద్రజ టేస్ట్ చేసింది.

తర్వాత సౌమ్య " పానకం ఎవరు బాగా చేశారు మేడం" అని అడిగేసరికి " రాఘవ గారు బాగా చేసారని" చెప్పింది ఇంద్రజ. "వెంకీ, తాగుబోతు రమేష్ చేసిన పానకం ఇంకా బాగుంది..ఒకసారి టేస్ట్ చేయండి" అని చెప్పింది సౌమ్య. "చేసాను కానీ రాఘవ చేసిందే బాగుంది" అని ఇంద్రజ అనేసరికి "కృష్ణ భగవాన్ సర్ మీరు ఈ పానకం టేస్ట్ చేసి చెప్పండి" అనేసరికి " సౌమ్య మీరు ఇంతమంది దగ్గర ఒపీనియన్ తీసుకునేటట్టయితే నన్ను అడగాల్సిన అవసరం లేదు..నువ్వు చేసింది కరెక్ట్ కాదు " అని సీరియస్ అయ్యింది ఇంద్రజ. రాఘవ స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు. అసలింతకీ ఏమయ్యిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.