English | Telugu

ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే సినిమాల్లో చేస్తానన్న ఫైమా!

ఫైమా.. బిగ్ బాస్ సీజన్-6 లోకి కంటెస్టెంట్ గా వెళ్ళి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత మొదలైన బిబి జోడీ డ్యాన్స్ షో లో సూర్యతో కలిసి జోడిగా పాల్గొంటూ తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటుంది.

గత వారం జరిగిన బిబి జోడి సెమీఫైనల్‌లో శేఖర్ మాస్టర్ గెస్ట్ గా వచ్చాడు. ఫైమా డ్యాన్స్ చూసి తనని హీరోయిన్ గా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ వస్తాడని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. దీంతో ఫైమా తెగ సంబరపడిపోయింది. అయితే పైమా ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానుల కోసం 'ఆస్క్ మీ క్వశ్చన్' స్టార్ట్ చేసింది. అందులో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను సెలెక్ట్ చేసుకొని వాటికి సమధానమిచ్చింది ఫైమా.

మిమ్మల్ని కలవాలి కానీ అది పాజిబుల్ అవుతుందా? అని ఒక అభిమాని అడుగగా.. పాజిబుల్ అవుతుందని ఫైమా అంది. మీకు సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తారా అని అడుగగా.. ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే చేస్తానని సమాధానమిచ్చింది ఫైమా. మీ జీవితంలో మీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళెవరని ఒకరు అడుగగా.. నా ఫ్యామిలీ మొత్తం నాకిష్టమని ఫైమా చెప్పింది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో 'బై బై రాయగఢ్' అని పోస్ట్ చేసింది ఫైమా. దీంతో తను రాయగఢ్ లో ఏదో ఒక ఈవెంట్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఫైమా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.