English | Telugu

తెలియదే అంటున్న నయని పావని!

ప్రతీ మనిషి జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలు ఉంటాయి. వాటినే మెమరీస్ అని అంటారు. అవి కొన్ని రోజులు గడిచాక ఓ బెస్ట్ మెమరీలా మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తాయి. అలాంటి గోల్డెన్ మెమరీ తన లైఫ్ లో జరిగిందంటూ నయని పావని తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ప్రేక్షకులలో తనకంటు ఓ ప్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది నయని పావని. అంతకమందు సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ తో కుర్రకారుని తన వైపు తిప్పుకుంది ఈ భామ. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటోలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.

కొన్ని రోజుల క్రితం యావర్ తో కలిసి ' ఆ కుర్చీని మడతబెట్టి ' పాటకి అదిరిపోయే స్టెప్స్ వేయడంతో అది ఫుల్ వైరల్ అయింది‌. తను నటించిన ' తెలియదే తెలియదే' అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తాజాగా రిలీజైంది. అది ఇప్పుడు ఎక్కడ చూసిన ఫుల్ ట్రెండింగ్ లో ఉంది‌. ఇక ఈ పాటకి హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో నైట్ డిస్కో లో లైవ్ లో పార్టిసిపేట్ చేసింది నయని. దీనిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి షేర్ చేసింది. ఇందులో తను పార్టిసిపేట్ చేయడం తనకెంతో హ్యాపీగా ఉందంటూ.. మన తెలుగు ఆడియన్స్ ముందు పాడటం అనే ఫీలింగ్ బాగుంది. డ్రీమ్ కమ్స్ ట్రూ అన్నట్టుగా ఉంది. మన సొంత సిటీలో పర్ఫామెన్స్ చేయడం.. తెలియదే నా హార్ట్ కి దగ్గరగా రావడం.. ఈ ఫీలింగ్ బాగుంది అంటూ నయని పావని ఆ పోస్ట్ కి రాసుకొచ్చింది. అయితే హౌస్ లో శివాజీని నయని పావని నాన్న అని పిలవడంతో తనకి ఎక్కువ మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.