English | Telugu
భానుశ్రీ పాడిన పాటను ఫన్నీగా ట్రోల్ చేసిన అష్షు!
Updated : Nov 18, 2022
సోషల్ మీడియాలో అష్షు రెడ్డి ఏది చేసిన ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాత్ టబ్ లో స్నానం చేసినా, ఆర్జీవీతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నా, పవన్ కళ్యాణ్ పేరు నడుము మీద వేయించుకున్నా ఏదో ఒక న్యూస్ తో రోజూ ట్రెండింగ్ లో ఉంటుంది.
ఇక ఇప్పుడు కూడా భానుశ్రీని ఇమిటేట్ చేస్తూ ఫుల్ వైరల్ అవుతోంది అష్షు. శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో యాక్టర్ భానుశ్రీ పవన్ కళ్యాణ్ మూవీ ‘తీన్ మార్’ నుంచి ‘గెలుపు తలుపులే’ అనే సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ.. ‘పాటలో డెప్త్ కనబడుతోంది’ అని కామెంట్ చేసింది. ఇక ఈ బిట్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు ఐతే అషూరెడ్డి భాను పడిన పాటనే ఫన్నీగా రీల్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నీకున్నంత ఎనర్జీ ఎవరికీ ఉండదు..ఈ రీల్ నీకోసమే డేడికేట్ చేస్తున్నా" అని ఒక టాగ్ లైన్ పెట్టింది ఈ వీడియోకి.