English | Telugu

అంట్లు తోమిన గీతు, ఆదిరెడ్డి!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం టాస్క్ రద్దైన విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ కి కోపం వచ్చింది. దీంతో హౌస్ లో ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేకుండా ఎత్తుకెళ్లారు. ఇక హౌస్ మేట్స్ ఆకలితో అలమటించారు. కాగా హౌస్ మేట్స్ ని రెండు జట్లుగా విభజించిన విషయం‌ తెలిసిందే. అయితే వీరికి టాస్క్ లు ఇవ్వడం జరిగింది. "ఈ టాస్క్ లో ఏ టీం అయితే గెలుస్తుందో, వారికే ఫుడ్ లభిస్తుంది."అని బిగ్ బాస్ చెప్పాడు.

కాగా ఫస్ట్ ఇచ్చిన టాస్క్ 'కబడ్డీ కబడ్డీ'. ఇందులో సంచాలకులురాలిగా గీతు చేసింది. అయితే టాస్క్ లో రెండు జట్లు పాల్లొనగా అందులో ఒకటి అయిన 'టాలీవుడ్ డైనమైట్స్' గెలిచి ఫుడ్ ని గెలుచుకున్నారు. ఆ తర్వాత రెండవ టాస్క్ 'రివర్స్ తగ్గాఫర్' లో మరొక టీం 'టాలీవుడ్ ఫెంటాస్టిక్' వాళ్ళు గెలిచి ఫుడ్ ని గెలుచుకున్నారు. కాగా ఆ జట్టులోని ఆదిరెడ్డి. మరో జట్టు లో ఉన్న గీతుకి తాను పొందిన ఫుడ్ ఇవ్వడం ద్వారా బిగ్ బాస్ వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, కొన్ని తోమాల్సిన గిన్నెలను పంపించి అవి తోమమని చెప్పాడు. వారు ఎలా చేస్తున్నారో చూడమని బాధ్యతలు రాజ్ కి అప్పజెప్పడం జరిగింది. కాగా నిన్న జరిగిన టాస్క్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు కానీ గీతు, ఆదిరెడ్డి గిన్నెలు తోముతున్నంత సేపు హౌస్ లో నవ్వుల వర్షం కురిసింది. దానికి తగ్గట్టుగా శ్రీహాన్ కామెడీ బాగుంది. "పెళ్లి లో వేస్తారు టెంట్లు మన గీతక్క తోముతోంది అంట్లు" అంటు ఫన్ ని క్రియేట్ చేసాడు రేవంత్. సరదాగా వాళ్ళని అటపట్టించాడు. కాని హౌస్ లో టాస్క్ లో అయిన గొడవలో అయిన నామినేషన్ లో అయిన గీతు ఉండాల్సిందే అని మరోసారి నిరూపించుకుంది. కాగా గీతు ప్రేక్షకులకు కావలిసిన వినోదాన్ని అందించడంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది. ఆదిరెడ్డి, గీతుల కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అంటోన్న ప్రేక్షకులు, ఆదిరెడ్డి ప్రతిసారి గీతుని "గీతక్క గీతక్క" అని పిలవడం కామెడిగా అనిపిస్తోంది.

కాగా ఇద్దరి మధ్య మంచి బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంది అనే చెప్పాలి.ఇద్దరు రివ్యూ రైటర్స్ ఏ కాబట్టి ఇద్దరి మైండ్ సెట్ ఒకటేనని, వాళ్ళని ఫాలో అయ్యే ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే బెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు టాప్-5 లో ఉంటారు అని బయట గుసగుసలు. ఈ ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి మరి.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.