English | Telugu

కిట్టీ పార్టీకి వచ్చినట్టు మొత్తం ఆడోళ్ళు వచ్చేశారు!

హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి కొద‌వ ఉండ‌ద‌ని చెప్పొచ్చు. లేటెస్ట్‌గా లేడీస్ మీద అత‌ను మ‌రోసారి ఆ త‌ర‌హా కామెంట్ చేశాడు. ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో "రీక్రియేషన్ థీమ్" మీద ఓల్డ్ సాంగ్స్ కి కంటెస్టెంట్స్ పెర్ఫార్మ్ చేశారు.ఈ షోకి జడ్జెస్ గా ఇప్పుడు శ్రద్ధా దాస్, యాని మాస్టర్, పూర్ణ వచ్చి కూర్చున్నారు.

ఆ ముగ్గురిని చూసేసరికి ఆది కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశాడు. "ఇది ఢీ - 14 షో కదా.. మరేంటి కిట్టి పార్టీకి వచ్చినట్టు ఆడోళ్ళంతా వచ్చేశారు" అన్నాడు. యాని మాస్టర్ ఆ మాటలకు పగలబడి నవ్వింది. తర్వాత సీన్ రీ క్రియేషన్ లో భాగంగా 'ఖుషి' మూవీలో భూమిక బొడ్డు సీన్ ని అఖిల్, ఆది, శ్వేతా నాయుడు, నయని, పావని చేశారు. పావని "సిద్దు నువ్ చూసావ్" అని అఖిల్‌తో అంటే, "వాడు చాలా చూశాడు, ఏం చూశాడో అడుగు" అంటూ ఆది ఒక డైలాగ్ వేశాడు.

తర్వాత ఆదితో "నువ్ కూడా చూశావ్" అని శ్వేతా అనేసరికి, "అవును చూసాను కానీ పెద్దగా నచ్చలా, యావరేజ్ గా ఉంది" అన్నాడు ఆది. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆది తన డైలాగ్స్ తో షోని నడిపించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.