English | Telugu
పాత పాటలు పాడుతూ నెటిజన్లపై ఆరోహీ రావు దాడి!
Updated : Aug 28, 2023
ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటల హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా పాత పాటలకి ఫోటోలతో ,వీడియోలతో ఆకట్టుకుంటున్నారు. కాగా ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పాత పాటలు పాడుకుందామా అంటూ ఆస్క్ మి క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో ఒక్కో అభిమాని ఒక్కోలా స్పందించగా వాటికి ఆమె తన గొంతుతో పాటలు పాడి వినోదాన్ని పంచింది.
ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో ప్రపంచానికి పరిచయమైంది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహీ.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహీ రావు. ఆరోహీ రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహీ చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహీ.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహీ.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహీ, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపిన ఆరోహీ.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ఎక్కువ రోజులు ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడిపి ఎలిమినేషన్ అయిన ఆరోహీ.. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అయితే హౌస్ నుండి బయటకొచ్చాక ఆరోహీ తన ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆర్జే సూర్యతో రీల్ ని చేసింది. కీర్తిభట్ పెళ్ళికి అందరు కలిసి వెళ్ళి అక్కడ సరదాగా గడిపారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పాత పాటలు పాడుకుందామని స్టార్ట్ చేసింది.. నీ ఫేవరేట్ సాంగ్ ఏంటి అని ఒకరు అడుగగా.. ఓ నా రాజా అంటూ పాడింది ఆరోహి. ఆ తర్వాత వసంతం సినిమాలోని గాలి చిరుగాలి పాట పాడమని ఒకరు అడుగగా తను పాడి వినిపించింది. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అంటూ ఆరోహీ పాడింది.'ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదో' నుండి మొదలుపెట్టి వరుసగా పాత పాటలు పాడుతూ తన అభిమానులకి వినోదాన్ని పంచింది ఆరోహీ రావు.