English | Telugu
Guppedantha Manasu: సూసైడ్ కి ప్రయత్నించిన కాలేజీ స్టూడెంట్.. ఇదేం ట్విస్ట్ రా మామా!
Updated : Nov 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -929 లో... ధరణి, శైలేంద్రలని కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రండి అని ఫణింద్ర చెప్తాడు. నేనే వెళ్దామని అనుకున్న మీరే పంపిస్తున్నారని ఫణీంద్రతో శైలేంద్ర చెప్తాడు. కాసేపటికి ధరణి నువ్వు వెళ్లి లగేజ్ సర్దుకొని రమ్మని శైలేంద్ర చెప్తాడు. ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు వసుధార ఆలోచిస్తు.. బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే రిషి వచ్చి వసుధారతో మాట్లాడతాడు. కాలేజీలో జరిగిన విషయం గురించి డిస్కషన్ చేస్తుంటారు. అసలు చిత్రని నిజంగానే ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడా అని వసుధార అడుగుతుంది. అలా వాళ్ళ మాటలు, వారు ప్రేమించుకున్న రోజుల వరకి వెళ్తాయి. వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లోని తీపి జ్ఞాపకాలని రిషి, వసుధారలు గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు.ఆ తర్వాత వసుధార వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తుంటే అప్పుడే కాలేజీ స్టూడెంట్ చిత్ర మెసేజ్ చేస్తుంది. అది చూసి షాక్ అయి కాల్ చేస్తే ఫోన్ కలవదు. మరుసటి రోజు ఉదయం మహేంద్ర, రిషి లకి వసుధార టిఫిన్ వడ్డీస్తుంది. రాత్రి ఎక్కడికి వెళ్ళావని వసుధారని రిషి అడుగుతాడు. వసుధార ఏదో చెప్పబోతుంటే అప్పుడే రిషికి ఎస్సై ఫోన్ చేసి.. మీ కాలేజీ స్టూడెంట్ చిత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది. మీరు రండి అని చెప్పగానే ముగ్గురు హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తారు.
ఆ తర్వాత రిషి, వసుధార, మహేంద్ర కలిసి హాస్పిటల్ కీ వెళ్తారు. చిత్రని ప్రేమించిన అబ్బాయి వాళ్లని చూసి మీరు ఎందుకు వచ్చారు? మీ వల్లే చిత్రకి ఇలా జరిగిందని అతను అరుస్తుంటాడు. మా వల్ల ఏంటి అని రిషి అడుగుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ఈ విషయం తెలియగానే మీడియా వాళ్ళు కాలేజీకి చేసి DBST కాలేజీ స్టూడెంటా అని అడిగారు. ఎవరో మీ కాలేజీపై బురద జల్లడానికి ఇలా చేసి ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని రిషికి డాక్టర్ చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు వసుధారని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. ఎందుకని రిషి అడుగుతాడు. వసుధర రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లి బెదిరించినట్లు.. ఇదిగో వీడియోలో ఉందని చూపించగా.. అది చూసి రిషి షాక్ అవుతాడు. ఏంటి వసుధార వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావని రిషి అడుగుతాడు.. వెళ్ళాను కానీ అక్కడ జరిగింది. అది కాదని వసుధార చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.