English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక మలుపు.. భర్త ఆచూకీ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-961 లో.. వసుధార కాలేజ్ కి వెళ్తుంటుంది. అయితే తను అలా కాలేజ్ కి వెళ్తుంటే తనెనెవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ‌ఎవరా అని మొదటిసారి చూస్తే ఎవరూ ఉండరు.. రెండోసారీ చూస్తే భద్ర ఉంటాడు. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావని భద్రని వసుధార అడుగుతుంది. మహేంద్ర సరే ఫాలో అవ్వమన్నాడని భద్ర అనగానే.. నన్ను ఫాలో అవ్వొద్దని వసుధార అంటుంది. సరే అని భద్ర వెళ్తుంటే అప్పుడే శైలేంద్ర ఎదురుపడాతడు. నిన్ను తననే ఫాలో అవ్వమన్నాను కదా ఎక్కడికెళ్తున్నావని శైలేంద్ర అంటే.. తను ఫాలో అవ్వొద్దని చెప్పిందని భద్ర అంటాడు.

ఇక అప్పుడే అక్కడికి మహేంద్ర వస్తాడు.‌ నీకు ఏం పని ఇక్కడ అని శైలేంద్రని మహేంద్ర అడుగుతాడు. ఇతనెవరు కొత్తగా కన్పిస్తున్నాడని శైలేంద్ర అనగానే.. తను మా డ్రైవర్ అని శైలేంద్రకి చెప్పి‌ భద్రని మహేంద్ర తీసుకెళ్తాడు.‌ ఇక శైలేంద్ర మెల్లిగా వసుధార క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. ‌మరోవైపు ముసలివాళ్ళ దగ్గర ఉన్న రిషి ఒక పాత ఫోన్ తీసుకొని వసుధారకి కాల్ చేస్తాడు. ఇక వసుధార నెంబర్ కి రిషి కాల్ చేయగానే వసుధార తెలియని నెంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేయదు. ‌ఇక‌ రెండోసారి కూడా రిషి కాల్ చేస్తాడు మళ్ళీ కట్ చేస్తుంది వసుధార.‌ ఒకవేళ రిషి సర్ కాల్ చేసాడేమో అని మళ్ళీ అదే నెంబర్ కి తిరిగి కాల్ చేస్తుంది. ఇక అవతల నుండి రిషి.. ఎలా ఉన్నావ్ వసుధార అని అంటాడు. నేను బాగున్నానని వసుధార చెప్తుంది. ‌ఇక అదే సమయంలో శైలేంద్ర ‌తన క్యాబిన్ దగ్గరకి వస్తాడు.‌ అది గమనించిన వసుధార... తెలివిగా డైవర్ట్ చేసి మాట్లాడుతుంది. సర్ చెప్తే అర్థం చేస్కోండి మీ ప్రమోషన్స్ మాకు అవసరం లేదు.. మళ్ళీ ఫోన్ చేసి‌ విసిగించకండి అని వసుధార కాల్ చేస్తుంది. ఎవరితోనో‌ ఫోన్ లో‌ మాట్లాడుతున్నావని శైలేంద్ర అడుగగా.. నీకవసరం లేదని వసుధార అంటుంది. ‌ఫోన్ లో మాట్లాడింది రిషీనే కదా అని శైలేంద్ర అనగానే..‌కాదని వసుధార అంటుంది. నువ్వు బయటకెళ్ళు అని శైలేంద్రకి వసుధార చెప్తుంది. దాంతో శైలేంద్ర వెళ్ళిపోతాడు.

కాసేపటికి శైలేంద్ర అదే నెంబర్ కి ఫోన్ చేస్తుంది. రిషి లిఫ్ట్ చేసి మాట్లాడతాడు‌. ఇందాక ఏంటి అలా మాట్లాడినవని‌ వసుధారని రిషి అడుగగా.. కాస్త ఇబ్బంది ఉండే సర్ అని వసుధార అంటుంది. మీరెలా ఉన్నారు‌ సర్ అని వసుధార అడుగగానే..‌ చావు వరకు వెళ్ళొచ్చి చావకుండా బ్రతికే ఉన్నాను సర్ అని వసుధార అని రిషి అంటాడు. ఎందుకు సర్ అలా మాట్లాడుతున్నారని‌ వసుధార ఎమోషనల్ అవుతూ అడుగగా.. లేవలేకపోతున్నాను‌, కూర్చోలేకపోతున్నానని రిషి అంటాడు. మీరెక్కడ‌ ఉన్నారో‌ లొకేషన్ చెప్పండి అని వసుధార అనగానే.. ఇది అలాంటి ఫోన్ కాదని రిషి అంటాడు. నన్ను కాపాడిన ఈ అవ్వ, అయ్యలకి ఇస్తానని రిషి ఆ ముసాలాయనికి ఫోన్ ఇస్తాడు. ఇక సాయం చేసినందుకు వసుధార థాంక్స్ చెప్తుంది. అడ్రెస్ చెప్పమని అనగానే ముసలాయన అడ్రెస్ చెప్తాడు.‌ ఇక రిషి ఫోన్ తీసుకొని.. ఎవరికి చెప్పకుండా వసుధారని ఒంటరిగా ఆ అడ్రస్ కి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత వసుధార ఆ చోటుకి ఒక్కతే బయల్దేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.