English | Telugu

కొత్త కోడలి ముందు పాత కోడలిని అవమానిస్తున్న కుటుంబం.. తనేం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 294 లో... కళ్యాణ్ అనామికల పెళ్ళిని చూడలేక అప్పు, కనకం, కృష్ణమూర్తి వెళ్లిపోతుంటే కావ్య వచ్చి వారితో మాట్లాడుతుంది. నా అత్తింట్లో జరిగే పెళ్ళికి నా పుట్టింటి వాళ్ళు అందరు ఉండాలని ఆశపడ్డాను కానీ ఇలా‌ మీరు మనసు కష్టపెట్టుకుని వెళ్తుంటే మనసుకి బాధగా ఉందని‌ కనకం, కృష్ణమూర్తిలతో కావ్య అంటుంది. ఇక అప్పుడే కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది. ఇంకొకసారి ఈ ఇంటివైపు రాకండి. ఇంత మోసం చేస్తారా? నా‌ కొడుకుకి మంచి మనసు ఉంది కాబట్టి నీ తప్పుని కూడా తన తప్పే అని అప్పుని ధాన్యలక్ష్మి తిడుతుంది. మీరేనా చిన్నత్తయ్య ఇలాగ మాట్లేదని కావ్య అనగానే.. నువ్వు కూడ వీళ్ళతోటే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది.

ఇంతకాలం నేనెంత భ్రమలో ఉన్నానో ఇప్పుడే అర్థమైంది.. నువ్వు కూడా ఆ ఇంటి ముద్దేవే, ఆ సంగతి నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. గొప్పగా బ్రతకాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి.. ఇలా మాయలు మోసాలు చేయకూడదని ధాన్యలక్ష్మి అంటుంది. మా వైపునుండి ఎలాంటి తప్పు జరగకూడదని నా కూతురు మనసు ని చంపుకొని ఈ పెళ్ళికి తీసుకొచ్చాను అది కూడా తప్పేనని తెలిసింది. కానీ మా కావ్య మాత్రం ఇందులో నిరపరాధి అని కృష్ణమూర్తి అంటాడు. ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు. అంతా మీ కుట్రే అను అర్థమైంది. ఇక బయల్దేరండని ధాన్యలక్ష్మి అంటుంది. కాసేపటికి ఇంట్లోకి కళ్యాణ్-అనామిక వస్తుంటే కావ్య హారతితో ఎదురువస్తుంది. అది చూసి అనామిక వాళ్ళ నాన్న అడ్డుచెప్తాడు. నీ చెల్లెలి స్థానంలో నా కూతురు వచ్చిందని, ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసి తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేయాలని కుట్ర చేసిందని కావ్య గురించి ఇష్టమొచ్చినట్టు అనామిక వాళ్ళ అమ్మ,నాన్న చెప్తారు. ఇక ఈ గొడవలో మధ్యలో ఇందిరాదేవి కలుగజేసుకొని ఆ విషయాలని అక్కడే వదిలేసి రావాలి కదమ్మా అని అంటుంది‌‌. ఇంకా కావ్యని ఇరికించాలని రుద్రాణి మధ్యలో లేనిపోనివి కల్పించి చెప్తుంది.

కావ్య హారతి ఇవ్వడం అనామిక లాగే నేను కూడా అశుభంగానే భావిస్తున్నాను. తప్పుని ఎత్తిచూపే హక్కు కూడా మీరు మాకు చెప్పే అధికారం కూడా మాకు లేదంటే మీ పెద్దరికానికి గౌరవమిచ్చి మేం తప్పుకుంటామని ఇందిరాదేవితో ధాన్యలక్ష్మి అంటుంది. కావ్య హారతిస్తే నేను లోపలికి రాను. అత్తయ్య హారతిస్తే వస్తాను అలా లేదంటే నాకు హారతే అవసరం లేదని అనామిక అంటుంది. నువ్వు వదినని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావ్. తన మనసెంత భాదపడుతుందని కళ్యాణ్ అంటాడు. అంటే నేను హారతి ఇవ్వడం నీకు ఇష్టం లేదా అని ధాన్యలక్ష్మి అనగానే అలా కాదమ్మ అని కళ్యాణ్ అంటాడు. తను హారతి‌ ఇవ్వకుంటే నేను లోపలికి రానని కళ్యాణ్ అనగా, తను హారతి‌ ఇస్తే నేను లోపలికి రానని అనామిక అంటుంది. ఇలాంటి విషయాలలో పంతానికి పోకూడదని మీరిద్దరు కలకాలం హ్యాపీగా ఉండాలనే నేను ఎప్పుడు కోరుకుంటున్నాని కావ్య అంటుంది. చూసారా మీరెన్ని మాటలన్నా తను మాత్రం మీరిద్దరు ఒక్కటవ్వాలని బలంగా కోరుకుంది సుబ్రహ్మణ్యం గారు అని రాజ్ అనగానే.. సేట్ కి రాజ్ ఇస్తానన్న రెండు కోట్లు గుర్తుంచుచేసుకుంటాడు అనామిక వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం. కాసేపు ఆలోచించి కావ్యతో హారతి తీసుకోవడానికి ఒప్పుకోమని అనామికతో వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం చెప్తాడు. ఆ తర్వాత అనామిక-కళ్యాణ్ ఇంట్లోకి వస్తారు. అనమికని వాళ్ళ అమ్మనాన్న పక్కకు తీసుకెళ్ళి.. కావ్య అంటే ఇంట్లో అందరికి మంచి ఉద్దేశ్శం ఉంది. నువ్వు తనతో గొడవపెట్టుకోకు. తనేం చేసిన నవ్వుతున్నట్టు నటించు వీలు దొరికినప్పుడు ‌తనని ఇరికించు అని అనామికకి వాళ్ళ అమ్మనాన్న చెప్తారు. ఆ తర్వాత అందరు కలిసి మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో.. డైనింగ్ టేబుల్ దగ్గర కావ్య వడ్డిస్తుంటే అపర్ణ, ధాన్యలక్ష్మి వద్దని వాళ్ళే వడ్డించుకుంటారు. ఇక అదంతా చూసిన రాజ్.. కావ్యని పిలిచి కర్రీ బాగుందని తనకి సపోర్ట్ గా ఉంటాడు. ఆ ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.