English | Telugu

పెళ్ళైనవాడి కోసం శ్రీముఖి చూస్తోందంటూ పరువు తీసేసిన అనంత్ శ్రీరామ్ ...


సూపర్ సింగర్ షోలో వెంకటేష్ అనే కంటెస్టెంట్ పాడిన పెళ్లి పాటతో రాహుల్ సిప్లిగంజ్ కి అనంత శ్రీరామ్ , శ్రీముఖి మధ్య పెళ్లి మాటలు ఎపిసోడ్ భలే ఫన్నీగా సాగింది. "సరే మరి పెళ్లి లాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావా లేదంటే ఎప్పటిదప్పుడే అని వదిలేస్తున్నావా.. విజిటింగ్ కార్డేనా వెడ్డింగ్ కార్డు ఇచ్చేదేమైనా ఉందా " అని అనంత్ శ్రీరామ్ అడిగేసరికి "నేను డైలీ చూస్తున్నా" అని రాహుల్ చెప్పేసరికి "డైలీనా" అని శ్రీముఖి షాకయింది. "నేను ఆడవాళ్లను చూస్తున్నా కానీ వాళ్ళే నన్ను చూడడం లేదు..నా దరిద్రం అలా దిగజారింది" అని బాధపడ్డాడు రాహుల్. "అంటే రోజూ పెళ్లిచూపులు కానీ ఏ రోజూ పెళ్లి కావడం లేదన్నమాట" అన్నాడు అనంత్ శ్రీరామ్.

"రోజూ చూస్తున్నా ఏ అమ్మాయి కూడా నన్ను చూడట్లేదు లైఫ్ లో ఇంకా పైకి రావాలి ఇంకా సెటిల్ కావాలి అంటున్నారు" అని రాహుల్ ఆనందంతో "ఎం అమ్మాయిలు నీ ఆస్కార్ ప్రోగ్రాం చూడలేదా" అని అనంత్ అడిగేసరికి "లేదన్నా త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా " అని రాహుల్ చిచ్చా చెప్పేసరికి "ఐతే అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ సొంత పబ్బుకు వెళ్తారా" అని అనంత్ రివర్స్ లో అడిగాడు. "అవును సొంత పబ్బుకే పోతాను..పక్క పబ్బుకు వెళ్లాలంటే బిల్ కట్టాలి కదా" అని రాహుల్ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత శ్రీముఖి కంటెస్టెంట్ వెంకటేష్ ని పటాయించింది. "చెప్పేది విను..నేను మనిషినే... నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలి.

ఎవరు ముందు కళ్ళు పక్కకు తిప్పేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు" అని వెంకటేష్ ని గట్టిగా పట్టుకుని చెప్పేసరికి "నువ్వు మనిషివి కానీ మగువవి ...అయ్యో అతన్ని అలా పట్టేసుకోకండి" అంటూ అనంత్ శ్రీరామ్ డైలాగ్స్ కి అందరూ పడీపడీ నవ్వేశారు. ఇక ఈ టైములో రాహుల్ ఎంట్రీ ఇచ్చి "షిరిముఖి అందరి పెళ్లి గురించి అడుగుతున్నావు మరి నీ పెళ్ళెప్పుడు" అనేసరికి "ఒక మంచి పెళ్ళైనవాడి కోసం చూస్తోంది" అంటూ అనంత్ శ్రీరామ్ ఆమె బదులుగా సమాధానం చెప్పి ఆమె పరువు తీసేసారు. శ్రీముఖి ఆ మాటకు అస్సలు ఫీల్ అవకుండా "ఆలోచిస్తాను అనంత్ గారు" అని నవ్వుతూ జవాబిచ్చింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..