English | Telugu

రూల్స్ బ్రేక్ చేసిన గీతు.. బిగ్ బాస్ ఏం చేస్తాడో..!

బిగ్ బాస్ ప్రతీ రోజు కొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిన్న జరిగిన టాస్క్ లో రేవంత్ దగ్గర ఉన్నవి తీసుకుందామని గీతు మాస్టర్ ప్లాన్ వేయగా, తన బొమ్మలే ఎత్తుకెళ్ళిపోయారు. అదేవిధంగా తన గేమ్ కూడా పోయింది. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరుగుతోన్న టాస్క్ లో గీతు, ఆదిరెడ్డి సంచాలకులుగా వ్యవహరించారు. అయితే గీతు బిగ్ బాస్ రూల్స్ ఫాలో కాకుండావాటిని తనకు నచ్చినట్టుగా మార్చేసింది. దీన్ని రేవంత్ తీవ్రంగా అపోజ్ చేసాడు.

బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా టాస్క్ నియామాలను అమలుచేయాల్సిన సంచలాకులు వాటిని పాటించకుండా, వారికి నచ్చినట్టు గేమ్ రూల్స్ ను మార్చడం అనేది ఇదే తొలిసారి. ఇచ్చిన నియమాలు కాకుండా సొంత నియమాలు పెట్టడం అనేది తప్పు. సంచాలకులు కేవలం అటలోని నియమాలు చెబుతూ, ఆడే కంటెస్టెంట్స్ కి వివరించాలి. వారికి తగిన న్యాయం చెప్పడం సంచాలకుల బాధ్యత. కాగా గీతు మిగత కంటెస్టెంట్స్ తో కలిసి గేమ్ లో పాల్గొంది. అప్పటికే రేవం‌త్ చెప్పాడు, "నువ్వుకొత్త రూల్స్ ఏం పెట్టవద్దు. బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటించాలి" అని.

గీతు మాత్రo తన ఆటిట్యూడ్ తో "నా ఇష్టం. నా గేమ్ ఇంతే. సంచాలకురాలిగా నా రూల్స్ ఇంతే" అన్నట్లు మాట్లాడింది. హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఆ తర్వాత సంచాలకురాలిగా ఉన్న గీతు సాధారణ కంటెస్టెంట్ గా గేమ్ ఆడుతోంది. అది చూసిన ఆదిరెడ్డి, "గీతు! నువ్వు చేసేది తప్పు. సంచాలకులుగా గేమ్ ని మాత్రమే చూడాలి. ఆడకూడదు" అనిచెప్పినా తన మాటను పెడచెవిన పెట్టింది. పైగా ఆది రెడ్డిని కూడా మాటలు అంది. "నువ్వు అతి చెయ్యకు ఆదిరెడ్డి. ఇది కూడా గేమే" అంటు బదులు ఇచ్చింది.

కాగా గీతు ప్రవర్తన, హౌస్ మేట్స్ కి చిరాకు తెప్పిస్తోందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గీతుని, వీకెండ్ లో వచ్చే నాగార్జున ఏం అంటాడో చూడాలి మరి.