English | Telugu
కైలాష్ రావణుడని వేద గమనించిందా?
Updated : Jun 21, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. స్టార్ ప్లస్ ఛానల్ లో ఏడేళ్ల క్రితం ప్రసారం అయిన హిందీ సీరియల్ `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లోని ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, రాజా శ్రీధర్, ఆనంద్, సుమిత్ర, బేబీ మిన్ను నైనిక తదితరులు నటించారు.
వేద కారణంగా కాలనీలో వుండే ఓ యువతి పండండి పాపకు జన్మనిస్తుంది. తనే డెలివరీ చేసి తల్లి, బిడ్డ ప్రాణాలని కాపాడుతుంది. ఆ కృతజ్ఞతతో పాప బారసాలకు వేద ఫ్యామిలీని ఆహ్వానిస్తారు. ఫంక్షన్ కి అంతా వెళ్లిపోతారు. వేద రెడీ అవుతుంటే యష్, ఖుషీ త్వరగా రమ్మని చెప్పి వెళ్లిపోతారు. కానీ యష్ బావ కైలాష్ మాత్రం వెళ్లకుండా ఎవరి కంట పడకుండా ఇంట్లోనే వుంటాడు. వేద రెడీ అవుతున్న విషయం గమనించి తలుపు చాటుగా చూస్తుంటాడు. తనని ఎవరో చూస్తున్నారని గమనించిన వేద ఎవరు అని బయటికి వచ్చి చూసేసరికి కైలాష్ కనిపిస్తాడు.
ఏంటీ మీరు వెళ్లలేదా అని వేద అడిగితే నువ్వెందుకు వెళ్లలేదని తనని తదేకంగా చూస్తుంటాడు. ఫంక్షన్ కి ఇంకా టైమ్ వుందని, కొంత సేపు కూర్చుని మాట్లాడుకుని వెళ్లొచ్చంటాడు. కానీ వేద మాత్రం వెళ్లాల్సిందే.. ఇప్పటికే ఆలస్యం అయిందని, ఇంకా లేట్ చేస్తే తన భర్త యష్ సీరియస్ అవుతాడని చెప్పి వెళ్లబోతోంది. ఇంతలో వేదని ఎలాగైనా ఫంక్షన్ కి వెళ్లకుండా చేయాలని చాకుతో తన లెఫ్ట్ హ్యాండ్ కు గాయం చేసుకుంటాడు. గాయం చూసి షాకైన వేద తనకు కట్టుకడుతూ వుంటుంది. ఛాన్స్ దొరికిందని వేదని తడుముతూ వుంటాడు. వెంటనే గమనించిన వేద పక్కకి తప్పుకుంటుంది. ఇంతలో యష్ అక్క అక్కడికి వస్తుంది. వేదని పిలుస్తున్నారని చెప్పి కైలాష్ ని తీసుకుని వెళ్లిపోతుంది.
కట్ చేస్తే .. యష్ ఆఫీస్ కు వెళుతూ ఖుషీని స్కూల్ కి తీసుకెళ్లే హడావిడిలో వుంటాడు. ఇదే సమయంలో వేద కళ్లు తిరిగి పడిపోతుంది. తనని పరీక్షించిన డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. కానీ వేద అది నిజం కాదని డాక్టర్ తో వాదిస్తుంది. కలసి కాపురమే చేయలేదు.. ప్రెగ్నెంట్ ఎలా అని యష్ మనసులో అనుకుంటాడు. వేద కూడా అదే ఫీలింగ్ తో వుంటుంది. హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ కు చెబుతుంది. డాక్టర్ నీలాంటి వాళ్లకు పిల్లలు పుట్టే ఛాన్స్ 10 శాతం వుందని చెబుతుంది. ఇదే సమయంలో అక్కడికి మాళవిక ఎంట్రీ ఇస్తుంది. వేదని తన మాటలకు గాయపరుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.