English | Telugu

బులెట్ భాస్కర్ మాటలకు రష్మీ చెవిలోంచి పొగలు!


సుధీర్ రష్మిని విడిచి వెళ్ళిపోయినా రష్మీకి మాత్రం ప్రతి మాటల తూటాలను ఎదుర్కోక తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు సుధీర్, రష్మీ స్మాల్ స్క్రీన్ పెయిర్ గా మంచి లవ్ జోడిగా వీళ్ళను ఆదరించి అభిమానించే ఆడియన్స్ చాలామంది పెరిగిపోయారు. ఐతే తర్వాత అనుకోని కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఎవరి దారి వాళ్ళు చూసుకున్న కూడా స్కిట్స్ లో మాత్రం వీళ్ళ ఇద్దరి టాపిక్ లేకుండా మాత్రం ఆ స్కిట్ కి మంచి హైప్ రాదనుకుని వాళ్ళ రిలేషన్ ని కాష్ చేసుకోవడం కూడా మొదలు పెట్టారు. ఐతే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లో మళ్ళీ సుధీర్, రష్మీ టాపిక్ రైజ్ అయ్యింది. బులెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష అరుంధతి మూవీలో జేజెమ్మ క్యారక్టర్ వేస్తుంది.

అలా తన రాజ్యంలోకి జేజెమ్మ నడుస్తూ వచ్చి రష్మీ వైపు చూస్తూ "ఆవిడెవరు" అని భాస్కర్ ని అడుగుతుంది. "ఆవిడ రేష్మి మహారాణి" అంటాడు భాస్కర్. మరి ఆవిడేంటి దిక్కులు చూస్తుందేంటి అని అడుగుతుంది వర్ష. "దిక్కులు కాదమ్మా ..తన మహారాజు యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకు వస్తానని పక్క రాజ్యానికి వెళ్ళాడు ". అని భాస్కర్ అనేసరికి రష్మీ చెవిలోంచి పొగలొస్తాయి ఆ డైలాగ్ కి మూతి తిప్పుకుంటుంది. "రాజ్యంలో ఖజానాలు ఎలా ఉన్నాయి" అని అడుగుతుంది వర్ష. "మీ ప్లాస్టిక్ సర్జరీలకే మొత్తం ఖర్చయిపోయిందమ్మా " అంటూ భాస్కర్ చెప్పేసరికి వర్ష నవ్వుకుంటుంది. ఇలా ఈ వారంలో స్కిట్స్ అన్నీ అలరించబోతున్నాయి.