English | Telugu
Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మి మెడలో తాళి.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా!
Updated : Jun 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -113 లో... సీతాకాంత్ కు రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంది. రామలక్ష్మి సీతాకాంత్ కు థాంక్స్ చెప్తుంది. ఎందుకని సీతాకాంత్ అడుగుతాడు. ఇందాక సిరి నీకు పుట్టబోయే పిల్లలకి ఏం పేర్లు పెడుతావని అడుగుతుంటే.. నేను ఇబ్బంది పడుతున్నాను.. నాకు కాఫీ కావాలంటూ పిలిచారు కదా అందుకేనని రామలక్ష్మి అనగానే.. నువ్వు ఇబ్బంది పడుతున్నావనే పిలిచానని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత పెద్దాయన రామలక్ష్మిని లవ్ చేస్తున్న విషయం చెప్పమని సీతాకాంత్ కు సైగ చేస్తాడు. దాంతో సీతాకాంత్ నీకో విషయం చెప్పాలని రామలక్ష్మితో అంటాడు. అంతలోనే మీరు చాలా గ్రేట్ సర్ .. ఎలాంటి స్వార్థం లేకుండా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నారు. ఆ అభి నేను అంటే ఇష్టమని చెప్పి.. ఇప్పుడు వేరే డబ్బున్నా అమ్మాయి దొరకగానే స్వార్థంతో వదిలేసాడు.. మీరు బాధలో ఉన్న నన్ను నా లక్ష్యం వైపు ప్రయాణించేలా చేశారని సీతాకాంత్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. సీతాకాంత్ తన ప్రేమ విషయం చెప్పలేకపోతాడు. ఏదో విషయం చెప్తాను అన్నారేంటని రామలక్ష్మి అడుగుతుంది. కాఫీ చాలా బాగుందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్ళిపోయాక పెద్దాయన వచ్చి.. ఏమైంది సీతా ఎందుకు రామలక్ష్మికి నీ ప్రేమ విషయం చెప్పలేదని అడుగుతాడు. తను నన్ను ఎలాంటి స్వార్థం లేని వాడని అనుకుంటుంది. అలాంటప్పుడు ఇప్పుడెలా చెప్పాలని సీతాకాంత్ అంటాడు.
రామలక్ష్మి బుక్స్ తీసుకొని వెళ్తుంటే కిందపడిపోతుంది. అప్పుడే అయ్యో అంటూ శ్రీలత, సందీప్ వస్తారు. రామలక్ష్మి తాళి కిందపడి ఉంటుంది. అది చూసి మంచి ఛాన్స్ దొరికింది.. ఇక మీ అంతటా మీరే మా పెళ్లి అబద్దం అనేలా చేస్తానంటూ ఆ తాళిని తీసుకొని.. అయ్యో తాళి విరిగిపోయింది ఇలా అయితే అరిష్టమని శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు అతని కాలుకు దెబ్బ తాకి ఉంటుంది. అది చూసి శ్రీలత.. అయ్యో ఇలా జరిగింది స్వామిని పిలిపించు అని అంటుంది. తర్వాత స్వామి ఇంటికి వస్తాడు. మళ్ళీ రామలక్ష్మి మెడలో సీతాకాంత్ తాళి కడితే అంతా శుభమే జరుగుతుందా స్వామి అని శ్రీలత అంటుంది. హోమం జరిపించండి.. ఆ తర్వాత రామలక్ష్మి మెడలో సీతాకాంత్ తాళి కట్టాలని అనగానే రామలక్ష్మి, సీతాకాంత్ షాక్ అవుతారు. వద్దని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.