English | Telugu
Guppedantha Manasu : మను గురించి ఆలోచిస్తూ.. రిషిని మర్చిపోయావా బాధపడేలా మాట్లాడిన దేవయాని!
Updated : Jun 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1091 లో....అసలు ఎందుకు ఇలా చేసావ్ మమ్మీ.. ఇప్పటికే ధరణి దృష్టిలో చీప్ అయిపోయాం.. నువ్వు చేసిన పనికి ఇంకెలా చూస్తుందని దేవయానితో శైలేంద్ర అంటాడు. నీకేం తెలియదు.. నన్ను అంత తక్కువ అంచనా వెయ్యకు.. నేనేంటో చూపిస్తాను పదా అని దేవయాని అంటుంది.
మరొకవైపు వసుధార ఇంటికి వెళ్లి పూజకి వచ్చిన వాళ్ళన్న మాటలు గుర్తుకుచేసుకొని ఏడుస్తుంది. అప్పుడే అనుపమ వచ్చి.. ఏం జరిగిందని అడుగుతుంది. వసుధార ఏం సమాధానం చెప్పదు. అప్పుడే మహేంద్ర వస్తాడు.. ఏం జరిగింది శైలేంద్ర ఏమైనా బెదిరించాడా అని అడుగుతాడు. అదేం లేదు మావయ్య అని వసుధార అంటుంది. వసుధార ఏం చెప్పట్లేదని ధరణికి మహేంద్ర ఫోన్ చేస్తాడు. పూజ బాగా జరిగిందా అని మహేంద్ర అడుగుతాడు. బాగా జరిగిందని ధరణి చెప్తుంది. అక్కడ నుండి వచ్చినప్పటి నుండి వసుధార ఏడుస్తుంది.. బాధ పడుతుంది.. ఏం జరిగిందని మహేంద్ర అనగానే.. ధరణి జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళ సంగతి చెప్తాను.. నా కోడలిని ఏడిపిస్తారా అని మహేంద్ర ఆవేశంగా మాట్లాడతాడు. పదమ్మా వసు.. నేను వాళ్ళ సంగతి చెప్తానని మహేంద్ర.. వసుధారని తీసుకొని వెళ్తుంటే.. దేవయాని, శైలంద్రలే ఇంటికి వస్తారు. ఎందుకు వచ్చారని మహేంద్ర అడుగుతాడు. అదేం ప్రశ్న ఎందుకు వచ్చారని అంటావేంటి మీకోసం వచ్చాను.. మీరు వస్తారని రకరకాల ప్రసాదలు చేశాను. వసుధార వచ్చింది కానీ త్వరగానే వచ్చింది.. అందుకే ప్రసాదం తీసుకొని వచ్చామని దేవాయని అంటుంది.
మీరు ఎందుకు వచ్చారో తెలుసని మహేంద్ర అంటాడు. ఎందుకు శత్రువులు లాగా చూస్తారని దేవయాని అనగానే.. మీరు శత్రువులే పూజకి పీలిచి రిషి గురించి తీసి బాధపెడతారా అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి ఎక్కడ అని దేవాయని అడుగుతుంది. వాడు లేడు చచ్చిపోయాడంటే మీరు జీర్ణించుకోవడం లేదు. రిషి ఉన్నాడు.. మూడు నెలలో తీసుకొని వస్తాను అన్నావ్.. మరి ఆ టైమ్ దగ్గర పడుతుంది.. ఇంకా వారం రోజులే ఉందని దేవయాని అంటుంది. మను గురించి ఆలోచిస్తూ.. రిషిని మర్చిపోయావా అని దేవయాని అంటుంది. రిషి సర్ ని వారం రోజుల్లో తీసుకొని వస్తానని వసుధార అనగానే తీసుకురాలేకపోతే నువ్వు అన్న మాట మీద నిలబడతావా అని దేవయాని అనగానే.. నిలబడతానని వసుధార అంటుంది. గడువులోపు తీసుకొని రాకపోతే నువ్వు వెళ్ళిపోతావా అని దేవయాని అడుగగా.. వెళ్ళిపోతానని వసుధార అంటుంది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందని వసుధార అంటుంది. ఇక కాసేటికి మను, అనుపమలు బాధపడేలా దేవయాని మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.