English | Telugu
Karthika Deepam2 : స్కూల్ కి వెళ్ళిన శౌర్య మిస్సింగ్.. వెతికే పనిలో ఆ ముగ్గురు!
Updated : Jun 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -61 లో..... ఈ రోజు వెళ్ళేటప్పుడు దీప హోటల్ లో టీ తాగి వెళ్ళాలని కార్తిక్ అనుకుంటాడు. మళ్ళీ వద్దులే నాకు ఏ దూరుద్దేశం లేకపోయిన చూసేవాళ్ళు అలా అనుకోరు కదా అని తానే మళ్ళీ అనుకుంటాడు. అపుడే జ్యోత్స్న కార్తీక్ దగ్గరికి వస్తుంది. మీలాంటి మా లాంటి వాళ్ళ ఆఫీస్ కు సరదాగా వస్తారా అని కార్తీక్ అంటాడు. ఏంటి బావ మీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళ అని వేరువేరుగా మాట్లాడుతున్నావని జ్యోత్స్న అంటుంది. నన్ను నువ్వు దూరం చేస్తున్నావా.. నాకు దూరం అవుతున్నావా అని జ్యోత్స్న అనగానే.. ఇద్దరం ఇక్కడే ఉన్నాం వరుసకు బావమరదలు అయిన బిజినెస్ లో మీరు టాప్ పోసిషన్ లో ఉన్నారు.. ఇప్పుడే నేను బిజినెస్ మొదలు పెట్టానని కార్తీక్ అంటాడు.
నేను టాప్ లో ఉంటే నువ్వు కూడా ఉన్నట్టేనని జ్యోత్స్న అనగానే.. ఒకరు ఇచ్చే పోజిషన్ వద్దు.. నేనే సంపాదించాలని కార్తీక్ అంటాడు. మాట మాట పెరిగి గొడవ పెట్టుకోవడం ఎందుకు.. గ్రానీ చెప్పింది కదా నా టాలెంట్ తో లైన్ లో పెట్టుకుంటానని జ్యోత్స్న అనుకుంటుంది. ఇద్దరం కలిసి ధాబా కు వెళదామా అని జ్యోత్స్న అనగానే కార్తీక్ సరే అంటాడు. మరొక వైపు దీప, శౌర్య కోసం స్కూల్ కు వెళ్తుంది. అక్కడ అందరు వెళ్లిపోతారు. అక్కడున్న సెక్యూరిటీ ని శౌర్య గురించి ఆడుతుంది. క్యాబ్ దగ్గర కన్పించింది. నేను లోపలికి వెళ్లి వచ్చేసరికి అక్కడ లేదని సెక్యూరిటీ చెప్పగానే.. నర్సింహ అన్న మాటలు గుర్తుచేసుకొని నర్సింహ తీసుకొని వెళ్లి ఉంటాడని దీప అనుకుంటుంది.
మరొకవైపు దీప గురించి అనసుయ శోభ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే దీప వచ్చి.. నా కూతురు ఎక్కడ అని అడుగుతుంది. నర్సింహా తీసుకొని వచ్చాడని అనగానే.. నీ కూతురు ఇక్కడ ఎందుకు ఉంటుంది. నా కొడుకు కిరాయి వెళ్ళాడని అనసూయ చెప్తుంది. మరొక వైపు కార్తీక్, జ్యోత్స్న ఇద్దరు కార్ లో వస్తుంటారు. ఖాళీగా ఉండే బదులు బిజినెస్ చూసుకోవచ్చు కదా అని జ్యోత్స్న తో కార్తిక్ అంటాడు. ఆ దీప చూడు అయిదో తరగతి చదువుకుంది.. ఎలా హోటల్ నడిపిస్తుందోనని అనగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. కార్ ఆపు అని జ్యోత్స్న అనగానే.. దీప పేరు వినగానే కోపం వచ్చిందా అని కార్తీక్ అంటాడు. లేదు అటు చూడు అంటూ దీపని చూపిస్తుంది. దీప ఏడుస్తుంటే కార్తీక్, జ్యోత్స్న లు తన దగ్గరికి వస్తారు. ఏమైందని అడగగా.. శౌర్యా కన్పించడం లేదని దీప చెప్తుంది. పద వెతుకుదామని కార్తీక్ అనగానే.. ముగ్గురు బయలుదేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.