English | Telugu
పెళ్ళిచూపుల్లో బావని ప్రేమించానని చెప్పిన సరోజ.. అయినా పెళ్ళికి ఓకే అన్న ధనరాజ్!
Updated : Jul 21, 2024
స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1132 లో.....సరోజకి జరిగే పెళ్లి చూపులకి రంగా రావడంతో శైలేంద్ర దేవయానిలు షాక్ అవుతారు. ఏంటి ఏసీ కూడా వెయ్యలేదు.. ఎందుకు అలా వణుకుతన్నారని రంగా అనగానే అంటే ఇందాక వస్తుంటే కార్ లో ఉందని దేవయాని అంటుంది. దేవయాని వాయిస్ విన్న వసుధార ఈ వాయిస్ ఎక్కడో వినట్టుందని లోపలికి వస్తుంటుంది. అప్పుడే తనని సరోజ చూసి లోపలికి వచ్చి.. ఎక్కడ నా బావని తన భర్త అని అందరిముందు చెప్తుందోనని భయపడి వసుధారని లోపలికి రాకుండా ఆపుతుంది.
మా కూతురు మిమ్మల్ని టెస్ట్ చెయ్యడానికి నా బావ అంటే ఇష్టం అంటూ చెప్తుందని ధనరాజ్ కి సంజీవయ్య చెప్తాడు. మరొకవైపు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని వసుధారపై సరోజ కోప్పడుతుంది. నీ పెళ్లి చూపులు చూడడానికి వచ్చానని వసుధార అనగానే.. అవసరం లేదంటూ వసుధారని అక్కడ నుండి పంపిస్తుంది సరోజ. ఆ తర్వాత సరోజ లోపలికి వస్తుంది. నేను బావని ప్రేమించానని సరోజ చెప్పగానే.. నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావని తెలుసని ధనరాజ్ అంటాడు. నాకు ఈ పెళ్లి ఇష్టమేనని ధనరాజ్ చెప్పగానే.. సరోజ షాక్ అవుతుంది. నేను ఎప్పుడు సరోజని మరదలిగా తప్ప.. ఇంకా ఏ ఉద్దేశంతో చూడలేదని రంగా క్లారిటీ ఇచ్చి వెళ్తాడు. అతను వెళ్తుంటే వెనక్కి తిరిగి చూసేసరికి శైలేంద్ర, దేవయాని ఇద్దరు భయపడతారు.ఇదంతా నా కూతురు కావాలనే చేసింది వచ్చేటప్పుడు కూడా ఇలాగే చేసింది.. కావాలంటే అడగండి అని సంజీవయ్య బుజ్జిని పిలుస్తాడు.
మరొకవైపు మను దగ్గరకి ఏంజిల్ వస్తుంది. ఎందుకు కాలేజీ నుండి బయటకు వచ్చేసావని ఏంజిల్ అడుగగా.. మా అమ్మ ఏం చెప్తే అది చేస్తానని మను అంటాడు. ఆ తర్వాత ధరణి కాఫీ తీసుకొని వచ్చి మహేంద్రకి ఇస్తుంది. వసుధార, రిషి లు దూరం అయ్యారని మహేంద్ర బాధపడుతుంటాడు. ఆ తర్వాత వసుధారని తీసుకొని రంగా ఆటో లో వస్తుంటే.. ఆపండి నాకు టీ తాగాలని ఉందని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.