English | Telugu

బిగ్ బాస్ ట్విస్ట్.. నో ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-7 పదకొండు వారాలు పూర్తిచేసుకుంది. అయితే పదకొండవ వారం హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉండగా నో ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

హౌస్ నుండి పదో వారం భోలే షావలి ఎలిమినేషన్ అయింది తెలిసిందే. అయితే పదకొండవ వారం మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉండగా మొదట యావర్, ఆ తర్వాత అమర్ దీప్, ప్రియంక,
శోభాశెట్టి, రతిక, అంబటి అర్జున్ లని సేవ్ చేసాడు నాగార్జున. ఇక హౌస్ లో అశ్వినిశ్రీ, గౌతమ్ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరు అనుకున్నారు. ఇక ఇద్దరి పేర్లు ఉన్న బాక్స్ లని తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చారు. వాటిలో తమ చేతిని ఉంచి నాగార్జున చెప్పినప్పుడు తీయాలని చెప్పాడు. ఎవరి చేతికి ఎరుపు రంగు అంటుకుంటుందో వారు ఎలిమినేటెడ్, ఆకుపచ్చ రంగు అంటుకుంటుందో వారు సేఫ్ అని అశ్వినిశ్రీ, గౌతమ్ లకి చెప్పాడు. ఇక కాసేపటికి ఇద్దరు తమ చేతులని బయటకు తీయగా ఇద్దరికి ఆకపచ్చ రంగు అంటుకుంది.

ఇక ఆ తర్వాత హౌస్ లోని వారంతా షాక్ అయ్యారు. మీరిద్దరు సేఫ్ అని అశ్వినిశ్రీ, గౌతమ్ లకి చెప్పాడు నాగార్జున. ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున అన్నాడు. ఎందుకంటే యావర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తిరిగి ఇచ్చేశాడు కాబట్టి బిగ్ బాస్ ఇద్దరిని సేవ్ చేశాడు. లేదంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేవారు మరొకరు సేవ్ అయ్యేవారని నాగార్జున చెప్పాడు. దీంతో హౌస్ లోని వారంతా షాక్ అయ్యారు. పదకొండవ వారం ఉల్టా పుల్టా ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.