English | Telugu
బంగారం రీల్ కి డాక్టర్ బాబు అద్దిరిపోయే పర్ఫార్మెన్స్!
Updated : Sep 28, 2022
బంగారం అక్క శాంతి సోషల్ మీడియాలో చేసిన ఒక రీల్ కొన్ని రోజుల నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు ప్రతీ ఒక్కరూ బంగారం మీద పడ్డారు. బంగారం వీడియోకు రీల్స్ చేస్తున్నారు. టీవీ చానెల్స్, యూట్యూబ్, జబర్దస్త్ లాంటి షోస్ లో బంగారం అక్క సందడి చేస్తోంది. ఇక బంగారం మీద వచ్చిన డీజే సాంగ్, ట్రోల్ వీడియోలకు రీల్స్ ఏ రేంజ్‌లో ఉంటున్నాయి వేరే చెప్పక్కర్లేదు. సెలబ్రిటీస్ చాలా మంది ఈ రీల్ ని చేశారు. ఇక ఇప్పుడు మంజుల, నిరుపమ్ కూడా ఈ రీల్ ని చేశారు.
బుల్లితెరపై డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్.. నెట్టింట్లో పంచులతో, ప్రాస కవితలతో హల్చల్ చేస్తుంటాడు. నిరుపమ్‌కు తగ్గట్టే మంజుల కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో స్పెషల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ టాపిక్స్ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే మంజుల చేసే రీల్స్ అందరినీ నవ్విస్తుంటాయి. అందుకే ఆమె షేర్ చేసే వీడియోలకు మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక నిరుపమ్ ఆ యూట్యూబ్ వీడియోల్లో ఉండే తీరు, మాట్లాడే మాటలు, వేసే పంచులు వైరల్ అవుతుంటాయి.
ఇక మంజుల చేసే రీల్ వీడియోలు కూడా అందరినీ నవ్విస్తుంటాయి.డాక్టర్ బాబు మాత్రం ఈ రీల్స్ కి చాలా దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మంజుల, నిరుపమ్ కలిసి బంగారం ట్రోల్ వీడియోకు రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేశారు. ఇందులో ఫైనల్గా ఛి పోరా అని మంజుల అనేసరికి చిరాకు పడిన నిరుపమ్.. పీక పట్టుకుని అలా తోసేసాడు మంజులను. మొత్తానికి ఈ రీల్ వీడియోను చూసిన జనాలు మాత్రం నవ్వుకుంటున్నారు. ఈ రీల్ కి మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.