English | Telugu

ఆ అమ్మాయిని కూడా మా అమ్మే తీసుకుపోయిందేమో..!

బుల్లితెర మీద పండగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కొత్త షోస్ కొత్త కాన్సెప్ట్స్ తో ఏ వారానికి ఆ వారం ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు.. శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎదురుచూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ ఐపోయింది.

మల్లెమాల వాళ్ళు బుల్లితెర సెలబ్రిటీస్ తో పాటు వాళ్ళ ఫామిలీస్ ని ఆహ్వానించి షోస్ చేయిస్తూ ఉంటారు. వారు కూడా బుల్లితెరఆర్టిస్టుల మీద పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా దసరా పండగ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టేజి పై డ్యాన్సర్ పండు తన ప్రేయసిని తలచుకుంటూ ఎమోషనల్ అవడం చూపించారు.

“ఊహ తెలియని టైంలో మా అమ్మ చనిపోయింది, తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను. అమ్మలా ఉంటానని చెప్పి ఆ అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది. తల్లి, తల్లి అని పిలుచుకునేవాడిని. కానీ చివరికి ఆమె కూడా నన్నొదిలేసి నా తల్లి దగ్గరకే వెళ్ళిపోయింది.. తన కంటే బాగా ఆ అమ్మాయి చూసుకుంటుందనే కోపంతో మా అమ్మే తన దగ్గరకు తీసుకుపోయిందేమో” అంటూ పండు ఏడ్చేశాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 2న ఆదివారం రోజున ప్రసారం కానుంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.