English | Telugu
దసరా ధమాకా పెర్ఫామెన్సులతో అదిరిపోనున్న ఢీ డాన్స్ షో
Updated : Sep 30, 2022
దసరా ఉత్సవాల సందర్భంగా టీవీలో ఎన్నో షోస్ అలరిస్తున్నాయి. ఢీ షో కూడా చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది. స్పెషల్ డేస్, పండుగలను పురస్కరించుకుని ఆ తరహా నృత్యాలతో కంటెస్టెంట్స్ చక్కని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఢీ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ముగ్గురు లేడీ జడ్జెస్ వచ్చేసారు. పూర్ణ, యాని మాస్టర్, శ్రద్ధాదాస్. అలాగే ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ సీఐడి బి.సుమతి ఐపీఎస్ వచ్చారు. "ఢీ షో అనేది బిగ్ షో..నాకు ఇక్కడకి వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని అన్నారామె.
దిశా పేరుతో లేడీ కంటెస్టెంట్స్ పోలీస్ యూనిఫార్మ్ లో వచ్చి అదిరిపోయే డాన్స్ చేసేసరికి "ఒక స్త్రీ శక్తి ఎంత గొప్పదో, ఈ యూనిఫామ్ విలువ ఏమిటో డాన్స్ రూపంలో " చూపించారన్నారు. ఇక లేడీ కంటెస్టెంట్ చేసిన ఫీట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తర్వాత ప్రేమికుడు మూవీ లోంచి "అందమైన ప్రేమరాణి" సాంగ్ కి తనుశ్రీ వేసిన డాన్స్ స్టెప్స్ కి జడ్జెస్ ఫిదా ఐపోయి పూర్ణ తనని పిలిచి మరీ హగ్ చేసుకుంది. తర్వాత "అయిగిరి నందిని" భక్తి గీతానికి సాగర్, రిషిక చేసిన డాన్స్ స్టేజి మీద అందరికీ పూనకమొచ్చి ఊగేలా చేసింది. ఇక ఈ రాబోయే ఈ ఢీ డాన్స్ ఎపిసోడ్ మొత్తం పవర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాయి.