English | Telugu

'బిబి హోటల్' వర్సెస్ 'గ్లాంప్ ప్యారడైజ్ హోటల్'!

'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ కి కెప్టెన్ పోటీ కోసం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ పేరు 'బిబి హోటల్' వర్సెస్‌ 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్'. 'బిగ్ బాస్', చంటిని 'కన్ఫేషన్ రూమ్' కి పిలిచి సీక్రెట్ టాస్క్ గురించి వివరించాడు. "చంటి మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే 'బిబి హోటల్' లోని అతిథులు 'గ్లాంప్ ప్యారడైజ్ హోటల్' కి వెళ్ళిపోయేలా చెయ్యాలి అలా చేస్తే మీరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు" అని బిగ్ బాస్ చెప్పాడు.

"బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కొంత మంది 'బిబి హోటల్' స్టాఫ్ మరియు ఉత్సాహవంతులైన అమ్మాయిలు నడుపుతున్న 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్'. కొందరు ఇంటి సభ్యులు అతిథులు గా వ్యవరించాలి. హౌస్ మేట్స్ లో కొందరు అతిధులు రెండు హోటల్స్ ఇచ్చే సదుపాయాలు ఉపయోగించుకొని వాటికి డబ్బులు చెల్లించాలి. అయితే రెండు హోటల్స్ లో ఉన్నవాళ్ళు కస్టమర్లను ఆకర్షించి, మీ హోటల్ కి వచ్చేలా చేసుకోవాలి. వారి దగ్గరి నుండి వీలైనంత ఎక్కువ డబ్బుని రాబట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయానికి ఏ హోటల్ దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్లలో నుండి కెప్టెన్సీ పోటీదారులు ఎన్నుకోబడతారు. అతిథుల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళలో నుండి కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఓడిపోయిన హోటల్లో కూడా ఎక్కువ డబ్బున్న వ్యక్తి కెప్టెన్సీ పోటీదారు అవుతారు. 'బిబి హోటల్' స్టాఫ్, మేనేజర్ గా సుదీప, చెఫ్ గా ఆదిత్య, అసిస్టెంట్ చెఫ్ గా మెరీనా, వెయిటెర్ గా గీతు, రేవంత్. హెల్పర్ గా చంటి వ్యవహరిస్తారు. 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్' లో వాసంతి, కిర్తి, ఆరోహీ, శ్రీ సత్య. మేనేజర్ గా ఫైమా వ్యవహరిస్తారు. అతిథులుగా రోహిత్ ఉంటాడు. రోహిత్ తన భార్య వదిలేసి పోతే తనని వెతికే పనిలో ఈ హోటల్ దగ్గరగా వస్తాడు. శ్రీహాన్ ఒక హీరో. లైఫ్ లో ఒకే ఒక్క మూవీ హిట్ తో అందరి చూపు తన వైపే ఉండాలనుకునే వ్యక్తి. సూర్య చిన్నప్పుడు దెబ్బ తగిలి గతం మర్చిపోయి తనకు నచ్చినట్టు తనకు గుర్తుకు వచ్చిన పాత్రలో జీవిస్తూ ఉండే వ్యక్తి. ఆదిరెడ్డి ఒక రివ్యూయర్. మరియు వీడియోలు చేసే అతిధి. రాజ్ మరియు అర్జున్ తన స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు మంచి లొకేషన్ ను వెతుక్కుంటూ వచ్చి వెరైటీ ట్రై చేసేవాళ్ళు. ఇక ఇనయా, ఈమె ఒక ధనవంతురాలైన అమ్మాయి." అంటూ అన్ని నియమాలు చెప్పుకొచ్చాడు 'బిగ్ బాస్'.


హోటల్ స్టాఫ్ అంత కూడా సంపాదించే పనిలో పడ్డారు. మధ్య మధ్యలో పాటలతో, డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. 'ఆకలేస్తే అన్నం పెడతా' పాటకి 'సూర్య' లేడీ గెటప్ వేసుకొచ్చి పోల్ డాన్స్ చేస్తుండగా, ఫైమాతో పాటు శ్రీసత్య, వాసంతి కూడా వచ్చి డ్యాన్స్ చేసారు. బాగా ఎంటర్టైన్ చేసారు. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్‌లో హైలెట్ గా నిలిచింది.

అయితే నాగార్జున గత శనివారం గట్టిగ ఇచ్చిన కౌంటర్ తో అందరూ బాగా సెట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఎవరి పాత్రలో వారు నటిస్తూ, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.