English | Telugu
బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడాలి అంటే ఫేక్‌గా ఉంటే చాలు!
Updated : Oct 10, 2022
చలాకి చంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఇక వచ్చాక బీబీ కేఫ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "చలాకి చంటి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమైపోయాడు" అని ఆడియన్స్ అనుకుంటున్నారని యాంకర్ అనేసరికి "ఇది నువ్వు ఇస్తున్న కామెంటా,జనాలు ఇచ్చారని చెప్తున్నావా?.. ఎవరు అన్నారో నా ముందుకు తీసుకురా, నేను సమాధానం చెప్తా" అంటూ ఫైర్ అయ్యాడు.
"హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరిని ఇరికించడానికైనా రెడీగా ఉన్నారు.. మీరు గేమ్ ఆడలేదు అని చెప్పకుండా మీ గేమ్ ఆపడం బిగ్ బాస్ తప్పు అంటారా?" అని అడిగేసరికి "ఎలాగైనా అనుకో" అంటూ ఘాటుగా చెప్పాడు చంటి. "బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడాలి అంటే ఫేక్ గా ఉంటే చాలు. అలా ఉన్న వాళ్ళే గేమ్ ఆడగలరు అని నాకు అనిపించింది. నువ్ కూడా ఫేక్ గానే ఆడావుగా" అని యాంకర్ వైపు బాణం సంధించాడు చంటి.
"మీకు ఇగో ఎక్కువ కాబట్టి ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు" అని యాంకర్ అనేసరికి "ఇగో ఎప్పుడొస్తుంది.. కెలికినప్పుడు వస్తుంది. నా ఇగోని కెలికిందెవరు" అంటూ గలాటా గీతూ ఇమేజ్ చూపించాడు. "నేను ఇలాగే ఉంటా, ఇలాగే గేమ్ ఆడతా, ఎవరినానైనా మోసం చేస్తా అనే బుద్ది ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు" అన్నాడు చంటి.