English | Telugu

అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడను!

బుల్లితెర మీద గ్లామరస్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వైపు షోస్, ఈవెంట్స్ తో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అను. లేటెస్ట్‌గా 'నిఖిల్‌తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు భార్యా భర్తలు. "ఇంటికి బాస్ ఎవరూ లేరు. ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం" అని చెప్పారు.సినిమా స్క్రిప్ట్స్, డేట్స్ వంటి వాటి విషయంలో ముందుగా భరద్వాజ్ విన్నాక అనసూయ వింటుందట‌. తాను ఓకే అంటేనే ముందుకు వెళ్తారట ఇద్దరూ.

అలాగే "సోషల్ మీడియాలో అను పై వస్తున్న ట్రోలింగ్స్, మీమ్స్ ని అస్సలు పట్టించుకోను. ఒకవేళ తను అప్సెట్ గా కనిపిస్తే 'అవన్నీ చూడొద్దు' అని చెప్తాను" అన్నారు భరద్వాజ్. "అలాగే కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి అనసూయ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్క లైఫ్. ఎలా కావాలంటే అలా ఉండడం ఇంపార్టెంట్. అందుకే అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడేది ఏమీ లేదు" అన్నారు అనసూయ భర్త.ఇంకా ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే "అనుకి పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా తనకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి" అంటూ నవ్వుతూ చెప్పారు భరద్వాజ్.

ఇక ఈ షోలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అనసూయ భరద్వాజ్. "ఇప్పుడు ఎవరైతే మీమ్స్ చేసే వాళ్ళు, ట్రోల్ల్స్ చేసే వాళ్ళు వున్నారో.. వాళ్లకు కూసాలు కదిలేలా ఒక దెబ్బ తగలబోతోంది. దాని మీద నేను వర్క్ చేస్తున్నా. ఆ కాంపెయిన్ అందరికీ వర్తిస్తుంది" అంటూ ఒక బాంబు పేల్చారు. "నాకు విజయ్ సేతుపతి మీద క్రష్ ఉంది. అలాగే నేను ఫెమినిస్ట్ ని కాదు, యాక్టివిస్ట్‌ని. ఎక్కడ తప్పు జరిగినా ఖండిస్తాను" అని చెప్పింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.