English | Telugu

'చంటి ఎలిమినేషన్ అస్సలు ఊహించనిది'..అమరదీప్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 6 ఈ వారం మంచి రసవత్తరంగా సాగింది. ఐతే చలాకి చంటి ఎలిమినేషన్ విషయం ఎవరూ ఊహించనిది. ఈ విషయం మీద చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. ఇలాంటి టైములో అమరదీప్ కూడా కొన్ని కామెంట్స్ చేసాడు. కొంతమంది అడిగిన ప్రశ్నలకు "బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తున్నట్టు ట్రోల్స్ అవి బాగా వచ్చాయి. కానీ అవకాశం రాలేదు. అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను. ఇక చంటి అన్న ఎలిమినేట్ అవడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అన్న ఎలిమినేట్ అయ్యాడు అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. చాలామంది ఆడని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నారు కదా. ఆయన్ని ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టాప్ 5 లో చంటి అన్న ఉంటాడని అనుకున్నా. బాగా ఆడతాడు, బాగా కామెడీ చేస్తాడు కదా కానీ మా అన్న కొంచెం స్ట్రయిట్ ఫార్వర్డ్ మరి అలానే ఉంటుంది. " అన్నాడు అమరదీప్.

ఇక నెటిజన్స్ మాత్రం "చంటి అన్న ఎలిమినేషన్ కి గలాటా గీతూ కారణం.. ఆయన చేసే కామెడీ గురించి హోస్ట్ ముందే కామెంట్ చేసింది. అలాంటి వాళ్ళు హౌస్ లో ఎందుకు ఉంచుతున్నారో ..బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.