English | Telugu
'ఎవరికి ఏం జరిగినా నా కంటెంట్ నాదే!'
Updated : Oct 11, 2022
క్యాష్ షోకి ప్రతీ వారం బిగ్ స్క్రీన్ సెలబ్రిటీస్ తో పాటు అప్పుడప్పుడు స్మాల్ స్క్రీన్ సెలెబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు. క్యాష్ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.ఈ షోకి ఢీ డాన్స్ షో నుంచి కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వచ్చారు. క్యాట్ మాస్టర్ - సూరజ్, శోభిత-మహాలక్ష్మి, సోమేష్-నిక్కీ, చెర్రీ-ఆర్నాల్డ్ ఈ షోకి వచ్చారు.
"ఏంట్రా నీ ఏజ్ చూస్తే చిన్నగా ఉంది..వేసే వేషాలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి.. ఏంట్రా విషయం" అని ఆర్నాల్డ్ ని సుమ అడిగేసరికి "ఏం లేదు ఆంటీ .. చెప్పాలి మీరే" అని సమాధానం ఇచ్చాడు ఆర్నాల్డ్. అతడిని సుమ లాగి పెట్టి కొట్టబోతుంది. తర్వాత జడ్జెస్ కంటెస్టెంట్స్ గా, కంటెస్టెంట్స్ జడ్జెస్ మారి ఒక డాన్స్ స్కిట్ పెర్ఫార్మ్ చేస్తారు.
ఇక చివరిలో సోమేష్ మాస్టర్ డాన్స్చేసినట్టు చేసి ఒక్కసారిగాకింద పడిపోయినట్టు యాక్ట్ చేసేసరికి స్టేజి మీద అందరూ ఒక్కసారిగా షాకైపోతారు. సుమకిఏం అర్థం కాదు కానీ అందరినీ కంట్రోల్ చేస్తుంది. "బాబు సోమేష్ నీకు ఒకటి అర్థమయ్యిందా.. ఎవరికి ఎం జరిగినా నాకు సంబంధం లేదు.. నా కంటెంట్ నేను తీసుకుని చెప్పేస్తాను" అని కౌంటర్ వేసేసరికి సోమేష్ స్టన్ ఐపోతాడు. ఇలా ఈ వారం క్యాష్ షో అలరించబోతోంది.