English | Telugu
‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు'.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
Updated : Oct 11, 2022
'ఆలీతో సరదాగా' షోకి ఈ వారం సెలెబ్రిటీగా అల్లు అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అలీ కూడా ఒక కాంట్రవర్సీ ప్రశ్న వేశారు. "అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రజలు చెవులు కొరుక్కుంటారు" అని అలీ అడిగేసరికిఅల్లు అరవింద్ కూడా ఆ విషయం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
"అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము బావబామ్మర్దులం కాక ముందు నుంచి అంటే 80వ దశకం నుంచి మంచి ఫ్రెండ్స్. ఇది పోటీ ప్రపంచం. ఇక్కడ పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలి. లేదంటే మనం వెనకబడిపోతూ ఉంటాం. ఇదొక చిన్న ఫిలిం సొసైటీ. కాబట్టి ఈ పోటీని తట్టుకుంటూ ఎవరికీ వారుగా పైకి వెళ్తున్నాం. ఐతే ఇలా ఎవరికి వారుగా ఎదుగుతూ ఉండేసరికి సహజంగా గొడవలు అంటూ రూమర్స్ రావడం సహజం. అని ఆయన చెప్పారు.
"కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఏం జరిగినా మేమంతా ఒక్కటే.. ఒక్క మాట మీదే నిలబడతాం అని అర్ధం చేసుకోవాలి. ప్రతీ పండగకి మా ఇంట్లో పూజ అవీ చేసేసుకున్నాక అందరం చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. మేం కలిసే వున్నాం అని చెప్పడానికి ప్రతీ ఇన్సిడెంట్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయలేము కదా.. మాలో ఎవ్వరి మీద ఒక్క మాట పడినా కూడా మేమంతా ఒక్కటైపోతాం. ఇందులో నో డౌట్" అంటూ క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.