English | Telugu

మితిమీరిపోతున్న శ్రీహాన్, ఇనయా మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. నామినేషన్లో అయినా, టాస్క్ లో అయినా ఎవరి ప్రతిభను వారు కనబరుస్తూ వస్తోన్నారు కంటెస్టెంట్స్. దీనికి కారణం ఒక టీం గా ఆడమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా ఆడేవాళ్ళు కొందరు అయితే, మనకెందుకులే అని వదిలేసేవాళ్ళు మరికొందరు. ఇదే తరహాలో ఇనయా, శ్రీహాన్ ల గొడవ కొనసాగుతోంది.

"ఎప్పటి గొడవలు అప్పుడే పరిష్కారించుకోవాలి. వాటిని ప్రొలాంగ్ చేయకూడదు." అని లాస్ట్ వీక్ నాగార్జున అందరికి తెలియజేసాడు. అయితే ఇనయా, శ్రీహాన్ మ‌ధ్య గొడ‌వ కంటిన్యూ అవుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ప్ర‌క్రియ‌లో శ్రీహాన్ ని నామినేట్ చేసింది ఇన‌యా. ఆ తర్వాత "నువ్వు టాస్క్ లో నాకు ఓర్పు లేదు అన్నావ్. ఓర్పు అనే వర్డ్ ఎలా అంటావ్, నాకు ఓర్పు లేదు అని నువ్వు ఎలా అంటావ్?" అని అడిగింది. "ఓర్పు లేదు అని అనలేదు. పేషెన్సీ తక్కువగా ఉంది. అది కాస్త ఉంటే బాగుండేది అన్నాను" అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. ఇలా నామినేషన్లో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది.

శ్రీహాన్, ఇనయా మ‌ధ్య‌ గొడవ రోజు రోజుకి పెరుగుతుండటం. అటు హౌస్ మేట్స్ కి ఇబ్బంది గాను, ఇటు ప్రేక్షకులకు ఇబ్బందిగాను తోస్తోంది. అయితే ఈ సారి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వస్తారని అనుకొంటున్నారు ప్రేక్షకులు. అయితే నాగార్జున వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న గొడవను క్లియర్ చేస్తాడో, లేదో.. చూడాలి మరి.