English | Telugu

నా కోసం సీమ సింహం వస్తున్నాడు అన్న దీపికా

ఢీ 20 లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా ఉంది. డాన్స్ ల విషయం పక్కన పెడితే ఆది, పండు, హోస్ట్ నందు, దీపికా కామెడీ స్కిట్ వేరే లెవెల్ లో ఉంది. ఆది రావడమే టేబుల్ మీద కాలేసుకుని కూర్చున్నాడు. పండు ఆది వీపు పడుతున్నాడు. "ఎం నొక్కుతున్నావురా నీ యయ్యా" అన్నాడు ఆది. ఇక పండు సీరియస్ గా ఆది మీద డైలాగ్ వేసాడు. "ఏంట్రా చేతికి నోరొచ్చింది, కళ్ళకు రంగొచ్చింది ఏంటి కామ కళా" అన్నాడు ఆది. "ఇవన్నీ కాదు. నన్ను పంపించేయండి, నాకు వేరే ప్రాబ్లమ్ వచ్చింది" అన్నాడు పండు. "నా అమ్మ, అయ్యా పిలిచాడు, ఇక్కడి కంటే అక్కడ ఎక్కువొస్తది అంటే చేతులూపి సాగనంపటానికి ఎవరనుకున్నవురా కాట్రాజ్..కరకరా నమిలేస్తా..ఇక్కడే ఉండాలి" అన్నాడు ఆది.

ఇంతలో హోస్ట్ నందు వచ్చాడు. ఎవరు మీరంతా నేను యాంకర్ ని అన్నాడు నందు. లాటరీ టిక్కెట్లు అమ్ముకునేవాడిలా ఉన్నా వీడు యాంకర్ ఏమిటి అన్నాడు నందు. మీ రౌడీయిజానికి సెట్ అయ్యే ఒక మాస్ మహారాణిని పిలుస్తా అన్నాడు. ఇంతలో దీపికా రానే వచ్చింది. "అరేయ్ పార్ట్ లు పార్ట్ లుగా చూస్తే ఈ అమ్మాయి బాగుంది పువ్వు తీసుకురా ప్రొపోజ్ చేద్దాం" అన్నాడు ఆది. "హలో నేను మాస్ మహారాణిని నాకు ప్రొపోజ్ చేయడానికి ఒక మాస్ మహారాజ దుబాయ్ నుంచి వస్తున్నాడు నన్ను ఎత్తుకెళ్లిపోవడానికి" అని చెప్పింది. "అక్కా నీకు కాబోయే వాడు ఎలా ఉండాలి" అని అడిగేసరికి "సీమ సింహంలా ఉండాలి" అని చెప్పింది. "మరి వీడున్నాడుగా" అని నందు ఆదిని చూపించాడు. "సీమపందిలా ఉన్నాడు వీడున్నాడుగా అంటున్నావా నువ్వు" అంటూ దీపికా అరిచింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.