English | Telugu

Brahmamudi : భార్య డ్రీమ్ కోసం ఆటో నడుపుతున్న భర్త.. అసలేం జరిగిందంటే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -528 లో..... రాజ్ దగ్గరకి ఇందిరాదేవి వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. కళాకృతికి డిజైన్స్ పంపిస్తున్నానని చెప్తాడు. అక్కడ కళావతి అని రాసావని ఇందిరాదేవి అంటుంది. కూరగాయలు తీసుకొని రా అని ఇందిరాదేవి అనగానే వెళ్లి కావ్యకి ఇవ్వు తానే తెస్తుందని రాజ్ అంటాడు. కనకం ఇంటికి వెళ్లి చెప్పాలా అని ఇందిరాదేవి అనగానే.. రాజ్ కి కావ్య లేదన్న విషయం గుర్తుకువస్తుంది. మరొక వైపు కావ్యతో రాజ్ గురించి మాట్లాడుతుంది కనకం. దాంతో నాకు వర్క్ ఉందని కావ్య టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది.


మరొకవైపు కళ్యాణ్ అలిగి భోజనం చెయ్యకుండా ఉంటాడు. భోజనం చెయ్ అని అప్పు అనగానే నేను చెప్పింది చేయనప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు వింటానని కళ్యాణ్ అంటాడు. పోలీస్ అనేది నీ కల.. అది నిజం చేసే బాధ్యత నాది.. నువ్వు కోచింగ్ తీసుకుంటే బాగుంటుందంటే నా మాట వినడం లేదని కళ్యాణ్ అనగానే.. అప్పు ఒప్పుకుంటుంది. దాంతో అప్పునే కళ్యాణ్ కి భోజనం తినిపిస్తుంది. మరొకవైపు అపర్ణ పూజ చేస్తుంటే రాజ్ కి నీరసంగా కన్పిస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి ఎందుకు ఇవన్నీ అంటాడు. నేను చెపింది విననప్పుడు నువ్వు చెప్పింది నేనేందుకు వినాలని అపర్ణ అంటుంది. వెళ్లి నా కోడలిని తీసుకొని రా ని అపర్ణ అనగానే.. అందరు తిరిగి తిరిగి అక్కడకే వస్తారెందుకు? నువ్వు రమ్మని చెప్పినా రాలేదని రాజ్ అనగా.. అంతలా తన మనసు విరిచేసావని అపర్ణ అంటుంది.

ఆ తర్వాత కావ్య డిజైన్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుంది. కావ్య ఎక్కడ వాళ్ళని చూస్తుందోనని సామంత్ అనామికలు టేబుల్ కింద దాక్కుంటారు. మరొకవైపు శృతి వేసిన డిజైన్ బాగోలేదని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాత కావ్య ఇచ్చిన డిజైన్స్ బాగున్నాయని చెప్తాడు ఆ తర్వాత తన బాస్ సామంత్ కి చూపిస్తాడు. బాగున్నాయి ఆ రాజ్ ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని దూరం చేసుకున్నాడని అనుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఆటోలో ఒక రౌడీ ఎక్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడు. డబ్బులు అడిగితే కళ్యాణ్ పై గొడవపడతాడు. అదంతా అప్పు చూసి వాడిని కొడుతుంది. నువ్వు ఆటో నడుపుతూ నాతో జాబ్ అని అబద్ధం చెప్తున్నావని అప్పు బాధపడుతుంది. తరువాయి భాగం లో డిజైన్ ఎక్స్పో కి రాజ్, రుద్రాణి వాళ్ళు వస్తారు. అక్కడ కావ్య ఎదరుపడితే తన మాటలతో బాధపెడుతుంది. ఆ తర్వాత ఇక అడుగడుగునా మీ కంపెనీకి మా కంపెనీ అడ్డు వస్తుందని రాజ్ తో సామంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.