English | Telugu
Brahmamudi : భర్తని తెలివిగా కాపాడుకున్న భార్య!
Updated : Sep 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -505 లో.....కంపెనీకి బాధ్యత వహించి పోలీసులకి కోపరేట్ చేస్తానని రాజ్ అంటాడు. తాతయ్య నమ్మకం పోగొట్టి ఈ తప్పు చేసి రాహుల్ పై తోసెయ్యాలని చూసావంటు రాజ్ ని రుద్రాణి తిడుతుంది. రాజ్ ని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. ఆగండి అంటు కావ్య వస్తుంది. ఈ ఫ్రాడ్ ఎవరు చేసారో కంపెనీకీ సంబంధించిన నకిలీ స్టాంప్ లు, సంతకాలు ఎవరు చేసారో.. ఈ ఫైల్ లో క్లియర్ గా ఉందని కావ్య.మ పోలీసులకి ఫైల్ ఇస్తుంది. అది చూసి రాజ్ గారు ఈ తప్పు చెయ్యలేదు.. తప్పు అంతా కూడా రాహుల్ చేసాడని అనగానే అందరు షాక్ అవుతారు.
లేదు రాజ్ ని తప్పించడానికి కావ్య ఏదో నాటకం ఆడుతుందని రాహుల్ అనగానే.. రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. వదిన అంటూ అపర్ణపై రుద్రాణి కోప్పడుతుంది. ఎన్ని తప్పులు చేసినా ఈ ఇంట్లో ఉండనివ్వడం మాది తప్పు.. ఎప్పుడో మెడ పట్టుకొని గెంటాల్సింది.. ఆడపడుచు స్థానంలో ఉన్నావని వదిలి పెడుతున్నానని రుద్రాణిపై అపర్ణ విరుచుకుపడుతుంది. ఆ తర్వాత రాహుల్ తప్పు చేసాడో లేదో తెలియదు కానీ వాడిని పోలీసులు తీసుకొని వెళ్తున్నారు ఆపండి అని రుద్రాణి అందరిని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎవరు పట్టించుకోరు. రాహుల్ ని పోలీసులు తీసుకొని వెళ్తారు. నువ్వు ఇదంతా ఎలా తెలుసుకున్నావంటూ రాజ్ అడుగుతాడు. రాహుల్ పై డౌట్ వచ్చి శృతిని గమనించమని చెప్పానని కావ్య అంటుంది. టైమ్ కి వచ్చి నీ భర్తని, కంపెనీ పరువుని కాపాడావని కావ్యని అపర్ణ అంటుంది. సారీ అక్క అని స్వప్నకి కావ్య చెప్తుంది. వాడి భార్యగా కంటే నేను.. నీ అక్కగా ఈ ఇంట్లో ఉంటేనే నాకు గౌరవమంటూ స్వప్న అంటుంది. అవన్నీ వింటున్న రుద్రాణి కోపంగా ఉంటుంది.
మరొకవైపు కళ్యాణ్ ఉప్మా చేసుకొని వస్తాడు. ఇది ఉప్మానా సాంబారా అంటూ బంటి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. మళ్ళీ రాహుల్ ని కావ్య అరెస్ట్ చేయించి తప్పు చేసిందన్నట్లు మాట్లాడేసరికి కావ్యకి కోపం వస్తుంది. నువ్వు కళ్యాణ్ ని ఇంటికి రప్పంచి ఉంటే ఇదంతా జరిగేది కాదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇందిరాదేవి, సీతారామయ్యల దగ్గరకి రుద్రాణి వెళ్లి తన కొడుకుని విడిపించమని అడుగుతుంది. తరువాయి భాగంలో రాహుల్ విడుదలై ఇంటికి వచ్చి.. నేను తప్పు చెయ్యలేదని నన్ను వదిలేసారని రాహుల్ అంటాడు. అందరూ నా కొడుకు తప్పు చేశారన్నారని రుద్రాణి అనగానే.. బయటకి వచ్చాడంటే తప్పు చెయ్యలేదని కాదని అని కావ్య అంటుంది. దాంతో కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.